ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. యోగి ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితిపై విమర్శల గుప్పిస్తూ.. ఓ వివాహ వేడుకలో జరిగిన వివాదం ఇందుకు నిదర్శనం అంటూ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వివాహంలో డీజే విషయమై వివాదం వచ్చింది. అందులో కొందరూ కర్రలతో, బెల్ట్‌లు, కుర్చిలతో దాడి చేసుకుంటున్నారు.
అక్కడే ఉన్న కొందరూ మహిళలు వారిని ఆపేందుకు యత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఐతే పోలీసులు ఆ ఘటనకు సంబంధించి వ్యక్తులను గుర్తించి ఆరోపణలు మోపి కేసు నమోదు చేయడమే గాక 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఈ నెల ఫిబ్రవరి 26న ముస్సోరి ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ మేరకు అఖిలాష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఒక వివాహ వేడుకలో జరిగిన రభసే అందుకు ఉదహరణ అని ట్వీట్ చేశారు. కాగా, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిని బహిరంగంగా హతమార్చడంపై యోగి ఆధిత్యానథ్‌ని ప్రశ్నించిన ఒక రోజు తర్వాతే ఈ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం.
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023
(చదవండి: ప్లీనరీ ముగింపు సమావేశంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం: మరో యాత్రకు సై!)
Comments
Please login to add a commentAdd a comment