దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: సీత ఐయామ్ నాట్ వర్జిన్ షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబు.. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరక పోస్టులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని సీసీఎస్ డీసీపీ మహంతికి ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు.
సీత ఐయామ్ నాట్ వర్జిన్ టైటిల్ విషయంలో వివాదం ఏర్పడింది. హిందువులకు పూజనీయురాలైన సీతాదేవి పట్ల తప్పుడు అభిప్రాయం వచ్చేలా, టైటిల్ పెట్టారని మేడ్చల్ జిల్లా బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ వి.ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాత నీరజ్‌నాయుడు, దర్శకుడు కైశిక్ బాబులతో పాటు నటీనటులపై పోలీసులు కేసు నమోదు చేశారు.