
నలుగురు వ్యక్తుల చుట్టూ మనమంతా
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, గౌతమి చాలా విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించ నున్న సంగతి తెలిసిందే.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, గౌతమి చాలా విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించ నున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ముఖ్య పాత్రల్లో నటించనున్న చిత్రం ‘మనమంతా’. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశాన్ని దేవుని పటాలపై చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సోమవారం చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్, సంగీతం: మహేశ్ శంకర్, నిర్మాత: రజనీ కొర్రపాటి.