చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి | Gauthami Files A Police Complaint Against Death Threats | Sakshi
Sakshi News home page

Gauthami: అనారోగ్యంతో ఆస్తి అమ్మేయాలనుకున్న నటి.. తనను, కూతుర్ని చంపుతామని బెదిరింపులు!

Published Wed, Sep 13 2023 11:37 AM | Last Updated on Wed, Sep 13 2023 11:59 AM

Gauthami Files a Police Complaint Against Fraud - Sakshi

చెన్నై: సీనియర్‌ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించింది. రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని.. అదేంటని ప్రశ్నించినందుకు తనను, తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నారంటూ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. గౌతమికి శ్రీపెరుంబూర్‌ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రూ.46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులు అమ్మేయాలనుకుంది. ఈ పనిని అలగప్పన్‌ అనే ఏజెంట్‌కు అప్పజెప్పింది.

కానీ ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్‌ ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల సాయంతో దాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇదేంటని గౌతమి ప్రశ్నించగా.. రాజకీయ అండతో నటిని, ఆమె కూతురిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమస్యల వల్ల తన కూతురి చదువు కూడా డిస్టర్బ్‌ అవుతోందని ఫిర్యాదులో పేర్కొంది గౌతమంది. తన నుంచి కొట్టేసిన రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని అభ్యర్థించింది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న అళగప్పన్‌పై చర్యలు చేపట్టాలని కోరింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా గౌతమి ప్రముఖ వ్యాపారవేత్త సందీప్‌ భాటియాను పెళ్లి చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి సుబ్బలక్ష్మి.. గౌతమి వద్దే ఉంటోంది. కాగా కొన్నేళ్లపాటు కమల్‌ హాసన్‌తోనూ కలిసి ఉన్న ఆమె 2016లో అతడితో విడిపోయింది.

చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన యంగ్‌ హీరో.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement