ఎల్సా బ్రెయిడ్ | Elsa Hairstyle | Sakshi
Sakshi News home page

ఎల్సా బ్రెయిడ్

Published Sat, Apr 9 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

ఎల్సా బ్రెయిడ్

ఎల్సా బ్రెయిడ్

ముడి బంగారం
ఎల్సా బ్రెయిడ్ హెయిర్ స్టయిల్ అనగానే ఎల్సా ఏ హెయిర్ స్టైలిస్టో అయివుంటుంది, ఆవిడ కనిపెట్టిన హెయిర్ స్టయిల్‌కి ఆ పేరు వచ్చివుంటుంది అనుకుంటారు ఎవరైనా. కానీ నిజానికి ఎల్సా అనేది ఓ కార్టూన్ క్యారెక్టర్ పేరు. వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ వాళ్లు తీసిన ‘ఫ్రోజెన్’ అనే యానిమేటెడ్ ఫిల్మ్‌లోని ప్రధాన పాత్ర ఎల్సా. ఆమెకు ఈ హెయిర్ స్టయిలే ఉంటుంది. అది చాలామందికి నచ్చేసింది. దాంతో ‘ఎల్సా హెయిర్ స్టయిల్’గా దీనికి పేరు వచ్చింది. ఈ జడ ఎలా వేసుకోవాలంటే...
 
Steps

1
నుదురు దగ్గర్నుంచి ఓ పాయను తీసి స్లయిడ్ పెట్టాలి.
 
2
తర్వాత రెండోవైపు నుంచి కూడా ఓ పాయను తీసి స్లయిడ్ పెట్టాలి.
 
3
రెండు పాయలనూ కలిపి రబ్బర్‌బ్యాండ్ పెట్టేయాలి.
 
4
బ్యాండ్ పెట్టిన జుత్తును మూడు పాయలుగా చేయాలి.
 
5
మూడు పాయలనూ జడలా అల్లుకోవాలి.
 
6
జడను అల్లుతూ మళ్లీ రెండు పక్కల నుంచి రెండు పాయలను తీసి ఈ జడలో కలిపేయాలి.
 
7
కొంచెం అల్లిన తర్వాత మళ్లీ పక్కనుంచి రెండు పాయలు తీసుకుని కలపాలి.
 
8
ఇలా పాయలు పాయలుగా తీసుకుని జడలు అల్లుకుంటూ పోవాలి. అయితే మరీ టైట్‌గా లేకుండా లూజులూజుగా ఉంచుకోవాలి.
 
9
జడ మొత్తం అల్లిన తరువాత చివర కాస్త జుత్తును వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి.
ఈ హెయిర్ స్టయిల్ మిడ్డీస్ మీదికి, జీన్స్-టీషర్ట్స్ మీదికి చాలా బాగుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement