మానవ సేవే ధ్యేయంగా పని చేయాలి
-
రక్తనిధుల ఏర్పాటులో రెడ్‌క్రాస్‌తో భాగస్వామ్యం వహించాలి
-
‘వేడుక’ కార్యక్రమంలో రోటరీ ఫౌండేష¯ŒS ప్రతినిధులకు గవర్నర్ సూచన
-
టీసీఎస్ మాజీ సీఈవోకు రోటరీ ఒకేషనల్ ఎక్స్‌లెన్స్
-
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం
నడకుదురు (కరప) :
దేశంలో పోలియో వ్యాధి నిర్మూలనలో రోటరీ సంస్థ చేసిన సేవలు ప్రశంసనీయమైనవని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. రక్తనిధుల ఏర్పాటులో ఇండియ¯ŒS రెడ్‌క్రాస్ సంస్థకు సహకరించాలని రోటరీ సంస్థకు ఆయన సూచించారు. కరప మండలం నడకుదురులోని కుసుమ సత్య కన్వెన్స¯ŒS హాలులో శనివారం రోటరీ డిస్ట్రిక్ట్ (3020) ఆధ్వర్యంలో నిర్వహించిన రోటరీ ఫౌండేష¯ŒS సెంటినరీ కాన్పరె¯Œ్స–వేడుకలో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టీసీఎస్ సంస్థ మాజీ సీఈఓ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేష¯ŒS పూర్వచైర్మ¯ŒS పద్మశ్రీ ఎస్.రామ్‌దొరైకు రోటరీసంస్థ ఒకేషనల్ ఎక్స్‌లె¯Œ్స లైఫ్‌టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును గవర్నర్ నరసింహ¯ŒS అందజేశారు. పరిశ్రమ, సేవారంగాల అవసరాలకు అనుగుణంగా విద్యాలయాలు సిలబస్‌ను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవార్డు గ్రహీత పద్మశ్రీ రామ్‌దొరై మాట్లాడుతూ నిరంతరం కొత్తనైపుణ్యాలు పెంపొందించుకుంటూ, ఎంచుకున్న రంగంలో అంకితభావంతో పనిచేస్తే విజయాలను, ఉన్నతశిఖరాలను అందుకోవచ్చని యువతకు సందేశాన్నిచ్చారు. తనను సత్కరించిన రోటరీసంస్ధకు రామ్‌దొరై కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రతినిధిగా హాజరైన డాక్టర్ వెంకటేష్ మేట¯ŒS మాట్లాడుతూ సంస్థ ప్రెసిడెంట్ జా¯ŒSఅండ్‌జూడీ సందేశాన్ని, శుభాకాంక్షలను రోటరీ డిస్ట్రిక్ట్ 3020 సభ్యులకు తెలియజేశారు. అట్లాంటాలో జరిగే సంస్థ 2017 వేడుకలకు సభ్యులను ఆహ్వానించారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్‌వీఎస్ రావు తమసంస్థ చేపట్టిన, చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ముందుగా గవర్నర్ నరసింహ¯ŒSకు రోటరీసంస్థ ప్రతినిధులు స్వాగతం పలకగా, గవర్నర్ జ్వోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, కేంద్ర మాజీమంత్రి ఎంఎం పళ్లంరాజు, కాకినాడరూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ, నులికుర్తి వెంకటేశ్వరరావు, రోటరీ సభ్యులు ఎస్‌సీహెచ్ రామకృష్ణ, జీకే శ్రీనివాస్, కళ్యాణచక్రవర్తి, ఎల్.సత్యనారాయణ, కేవీఎస్ ఆంజనేయమూర్తి, సీఆర్ మోహ¯ŒS తదితరులు పాల్గొన్నారు.