nadakuduru
-
నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..!
చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ ఫృద్వీశ్వరస్వామి ఆలయం, చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు. నడకుదురు నరకునికి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, మోక్షపురిగా గుర్తింపు ఉంది. నరకాసురుడు పూజించిన స్థలం.. నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, ద్విముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ ఫృద్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు ఫృద్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడకుదురు గ్రామంలోని ఫృద్వీశ్వరాలయం. వధ జరిగింది ఇక్కడే.. నరకాసురుడి ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించ దలచిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా, సత్యభామ ఫృద్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం, నరకాసురుని తల్లిలాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నదీతీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కృష్ణ–భామల విహార స్థలం.. నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెంతనున్న పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు, సత్యభామలు లక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పూజలు చేసినట్లు కథనం. నడకుదురు ఆలయం వద్ద పాటలీవృక్షంకింద లక్ష్మీనారాయణుని విగ్ర హం నేటికీ భక్తుల పూజలందుకుంటోంది. మహిమాన్వితం పాటలీవృక్షం.. గ్రామ చారిత్రక, ఆథ్యాత్మిక వైభవానికి నిదర్శనం నడకుదురు ఫృద్వీశ్వరాలయం చెంతనున్న దేవతావనం. దేవలోక వనమాత పాటలీ వృక్షాలు దేశంలో కేవలం కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉన్నాయి. కరకట్ట దిగువనే నదిలో కొబ్బరిచెట్లు, పాటలీవృక్షాలు, ఉసిరిచెట్ల మధ్య ఆలయం ఉంటుంది. చుట్టూ పసుపుతోటలు, వాణిజ్య పంటలతో చల్లని వాతావరణం భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతుంది. దీపావళి ప్రత్యేకత సంతరించుకుంటుంది. -
సేవాకార్యక్రమాలు అభినందనీయం
కరప (కాకినాడ రూరల్) : హక్కుల పోరాటానికి రక్తం చిందించే కార్మికులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ కార్మిక సంక్షేమ మండలి డైరెక్టర్ రావులపల్లి రవీంద్రనా«థ్ అన్నారు. కరప మండలం నడకుదురులో ఆదివారం శ్రీరామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు నిధులను చంద్రన్న బీమా పథకానికి మళ్లించడం దారుణమన్నారు. సంక్షేమబోర్డు పరిరక్షణకు, కార్మిక సమస్యల పరిష్కారానికి విజయవాడలో ఈ నెల 24న తలపెట్టిన ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు రావాలన్నారు. పలువురు మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన కార్మికులందరికీ పింఛ¯ŒS ఇవ్వాలని డిమాండ్ చేశారు. నడకుదురు రామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు ముమ్మిడి అచ్చియ్య(బాబ్జీ) మాట్లాడుతూ తమ సంఘ సభ్యుడి కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందని, రక్తం కావాలని అడిగితే ఇటువంటి వ్యాధిగ్రస్తుల చిన్నారులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా 50 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్ సంస్థకు అందజేశారు. డాక్టర్ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఏడాదికి 24 ప్యాకెట్ల రక్తం అవసరమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లా రాఘవరావు, రాష్ట్ర సమితి సభ్యులు నక్కా కిశోర్, కె.సత్తిబాబు, భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తుక కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాటిపాక మధు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ముమ్మిడిఅచ్చియ్య, వెలుగుబంట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ముమ్మిడి అర్జునరావు పాల్గొన్నారు. -
మానవ సేవే ధ్యేయంగా పని చేయాలి
రక్తనిధుల ఏర్పాటులో రెడ్‌క్రాస్‌తో భాగస్వామ్యం వహించాలి ‘వేడుక’ కార్యక్రమంలో రోటరీ ఫౌండేష¯ŒS ప్రతినిధులకు గవర్నర్ సూచన టీసీఎస్ మాజీ సీఈవోకు రోటరీ ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం నడకుదురు (కరప) : దేశంలో పోలియో వ్యాధి నిర్మూలనలో రోటరీ సంస్థ చేసిన సేవలు ప్రశంసనీయమైనవని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. రక్తనిధుల ఏర్పాటులో ఇండియ¯ŒS రెడ్‌క్రాస్ సంస్థకు సహకరించాలని రోటరీ సంస్థకు ఆయన సూచించారు. కరప మండలం నడకుదురులోని కుసుమ సత్య కన్వెన్స¯ŒS హాలులో శనివారం రోటరీ డిస్ట్రిక్ట్ (3020) ఆధ్వర్యంలో నిర్వహించిన రోటరీ ఫౌండేష¯ŒS సెంటినరీ కాన్పరె¯Œ్స–వేడుకలో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టీసీఎస్ సంస్థ మాజీ సీఈఓ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేష¯ŒS పూర్వచైర్మ¯ŒS పద్మశ్రీ ఎస్.రామ్దొరైకు రోటరీసంస్థ ఒకేషనల్ ఎక్స్లె¯Œ్స లైఫ్‌టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును గవర్నర్ నరసింహ¯ŒS అందజేశారు. పరిశ్రమ, సేవారంగాల అవసరాలకు అనుగుణంగా విద్యాలయాలు సిలబస్‌ను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవార్డు గ్రహీత పద్మశ్రీ రామ్‌దొరై మాట్లాడుతూ నిరంతరం కొత్తనైపుణ్యాలు పెంపొందించుకుంటూ, ఎంచుకున్న రంగంలో అంకితభావంతో పనిచేస్తే విజయాలను, ఉన్నతశిఖరాలను అందుకోవచ్చని యువతకు సందేశాన్నిచ్చారు. తనను సత్కరించిన రోటరీసంస్ధకు రామ్‌దొరై కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రతినిధిగా హాజరైన డాక్టర్ వెంకటేష్ మేట¯ŒS మాట్లాడుతూ సంస్థ ప్రెసిడెంట్ జా¯ŒSఅండ్జూడీ సందేశాన్ని, శుభాకాంక్షలను రోటరీ డిస్ట్రిక్ట్ 3020 సభ్యులకు తెలియజేశారు. అట్లాంటాలో జరిగే సంస్థ 2017 వేడుకలకు సభ్యులను ఆహ్వానించారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు తమసంస్థ చేపట్టిన, చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ముందుగా గవర్నర్ నరసింహ¯ŒSకు రోటరీసంస్థ ప్రతినిధులు స్వాగతం పలకగా, గవర్నర్ జ్వోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, కేంద్ర మాజీమంత్రి ఎంఎం పళ్లంరాజు, కాకినాడరూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ, నులికుర్తి వెంకటేశ్వరరావు, రోటరీ సభ్యులు ఎస్‌సీహెచ్ రామకృష్ణ, జీకే శ్రీనివాస్, కళ్యాణచక్రవర్తి, ఎల్.సత్యనారాయణ, కేవీఎస్ ఆంజనేయమూర్తి, సీఆర్ మోహ¯ŒS తదితరులు పాల్గొన్నారు.