సేవాకార్యక్రమాలు అభినందనీయం
Published Sun, Apr 2 2017 11:11 PM | Last Updated on Mon, Oct 22 2018 8:20 PM
కరప (కాకినాడ రూరల్) :
హక్కుల పోరాటానికి రక్తం చిందించే కార్మికులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ కార్మిక సంక్షేమ మండలి డైరెక్టర్ రావులపల్లి రవీంద్రనా«థ్ అన్నారు. కరప మండలం నడకుదురులో ఆదివారం శ్రీరామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు నిధులను చంద్రన్న బీమా పథకానికి మళ్లించడం దారుణమన్నారు. సంక్షేమబోర్డు పరిరక్షణకు, కార్మిక సమస్యల పరిష్కారానికి విజయవాడలో ఈ నెల 24న తలపెట్టిన ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు రావాలన్నారు. పలువురు మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన కార్మికులందరికీ పింఛ¯ŒS ఇవ్వాలని డిమాండ్ చేశారు. నడకుదురు రామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు ముమ్మిడి అచ్చియ్య(బాబ్జీ) మాట్లాడుతూ తమ సంఘ సభ్యుడి కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందని, రక్తం కావాలని అడిగితే ఇటువంటి వ్యాధిగ్రస్తుల చిన్నారులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా 50 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్ సంస్థకు అందజేశారు. డాక్టర్ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఏడాదికి 24 ప్యాకెట్ల రక్తం అవసరమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లా రాఘవరావు, రాష్ట్ర సమితి సభ్యులు నక్కా కిశోర్, కె.సత్తిబాబు, భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తుక కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాటిపాక మధు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ముమ్మిడిఅచ్చియ్య, వెలుగుబంట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ముమ్మిడి అర్జునరావు పాల్గొన్నారు.
Advertisement