very good
-
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్‌ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్‌గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ -
సేవాకార్యక్రమాలు అభినందనీయం
కరప (కాకినాడ రూరల్) : హక్కుల పోరాటానికి రక్తం చిందించే కార్మికులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ కార్మిక సంక్షేమ మండలి డైరెక్టర్ రావులపల్లి రవీంద్రనా«థ్ అన్నారు. కరప మండలం నడకుదురులో ఆదివారం శ్రీరామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు నిధులను చంద్రన్న బీమా పథకానికి మళ్లించడం దారుణమన్నారు. సంక్షేమబోర్డు పరిరక్షణకు, కార్మిక సమస్యల పరిష్కారానికి విజయవాడలో ఈ నెల 24న తలపెట్టిన ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు రావాలన్నారు. పలువురు మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన కార్మికులందరికీ పింఛ¯ŒS ఇవ్వాలని డిమాండ్ చేశారు. నడకుదురు రామలింగేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు ముమ్మిడి అచ్చియ్య(బాబ్జీ) మాట్లాడుతూ తమ సంఘ సభ్యుడి కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందని, రక్తం కావాలని అడిగితే ఇటువంటి వ్యాధిగ్రస్తుల చిన్నారులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా 50 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్ సంస్థకు అందజేశారు. డాక్టర్ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఏడాదికి 24 ప్యాకెట్ల రక్తం అవసరమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లా రాఘవరావు, రాష్ట్ర సమితి సభ్యులు నక్కా కిశోర్, కె.సత్తిబాబు, భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తుక కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాటిపాక మధు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ముమ్మిడిఅచ్చియ్య, వెలుగుబంట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ముమ్మిడి అర్జునరావు పాల్గొన్నారు. -
చెరసాలకు చమురు సిరి
మరో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సన్నాహాలు మొదటి పెట్రోల్ బంక్‌లో పెరిగిన అమ్మకాలు సంవత్సరానికి కోట్లలో టర్నోవర్ రాజమహేంద్రవరం క్రైం : సెంట్రల్ జైల్ ఆధ్వర్యంలో మరో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐఓసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లాభాల బాటలో పయనించడంతో జైళ్ల శాఖ మరో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మొదటి పెట్రోల్ బంక్ రోజుకు సుమారు 15 లక్షల వరకూ వ్యాపారం చేస్తున్నది. రెండో బంక్‌కు ఉద్యాన వన శాఖ కార్యాలయం వద్ద ఉన్న స్ధలాన్ని కేటాయించేందుకు పెట్రోలియం సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ బంక్‌ను హెచ్‌పీసీఎల్ కు కేటాయించేందుకు అధికారులు చర్చిస్తున్నారు. రికార్డు స్థాయిలో అమ్మకాలు మొదటి పెట్రోల్ బంక్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగుతున్నాయి. ఈ ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ బెస్ట్ గ్రోత్ అవార్డు సాధించింది. ప్రస్తుతం పెట్రోల్ బంక్ ను మరింత ఆధునికీకరించి 2250 మీటర్ల స్థలంలో 6 పంపులతో మరింత పెంచుతున్నారు. ఈ పెట్రోల్ బంక్‌తో ఖైదీలకు, జైల్‌కు కూడా మంచి ఆదాయం లభిస్తోంది. జైళ్లశాఖ స్థలాన్ని 28 ఏళ్లకు సంవత్సరానికి రూ 53 వేలు చొప్పున ఐఓసిఎల్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ లీజు రూ 1.10 లక్షలకు పెరిగింది. దీనితో పాటు ఈ బంక్‌లో విక్రయించే ప్రతి లీటరు పెట్రోల్‌కు రూ.2.25 పైసలు, డీజల్‌కు రూ.1.20 పైసలు చొప్పున జైళ్లశాఖకు కమీష¯ŒS లభిస్తోంది. దీనితో పాటు ఖైదీలకు ఉపాధి లభిస్తుంది. గతంలో మూడు షిఫ్ట్‌లకు 18 మంది ఈ బంక్‌లో పని చేసేవారు. ప్రస్తుతం పెంచిన బంక్‌ను బట్టి మరో 20 మంది వరకూ పని చేసేందుకు అవకాశం ఉంది. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
జిల్లా కబడ్డీ, టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక వేళంగి(కరప): చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రిన్సిపాల్ సత్తి వీరవెంకట సత్యనారాయణరెడ్డి అన్నారు. కరప మండలం వేళంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క» డ్డీ, టేబుల్‌టెన్నిస్ జిల్లాజట్ల ఎంపిక ఆటల పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ, ఆటలలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని, అందుకు అనుగుణంగా శిక్షణ పొందాలన్నారు. జిల్లా స్కూలు గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 కార్యదర్శి వై.తాతబ్బాయి పర్యవేక్షణలో వివిధ కళాశాలల పీడీలు వి.సీతాపతిరావు, ఈవీవీ సత్యనారాయణ, పి.రత్నసామ్యూల్, పి.గంగాధర్‌రెడ్డి, జే.రఘరాం, సతీష్, టీ.వీరయ్యచౌదరి, రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి గన్నమనేని చక్రవర్తిఎంపిక కమిటీ సభ్యులుగా వ్యహరించారు. జిల్లా క» డ్డీ బాలుర జట్టు టి.దుర్గాచంద్, కె.హరిబాబు, వి.ధనశేఖర్, పి.బాలసుబ్రమణ్యం, పి.ధర్మతేజ(కాకినాడ), కె.చక్రవర్తి, బి.అనిల్(సామర్లకోట), పి.భవానీప్రసాద్(కిర్లంపూడి), కె.ప్రసాద్(గొల్లపాలెం), ఎ.రాము(కొత్తపేట), ఎ.వీరబాబు(కాకినాడ), ఎస్.రాజేష్(రాజమహేంద్రవరం), జి.సేలంరాజు(పెద్దాపురం) జిల్లా కబడ్డీ బాలికల జట్టు ఎన్.కావ్య, ఐ.సూర్యభవానీ(కాకినాడ), పి.జగదేశ్వరీదేవి, ఎంవీవీ సాయిలక్ష్మి(గొల్లపాలెం), పి.ఐంద్రాణి(కాజులూరు), ఎన్.శిరీష(గోకవరం), ఎన్.నాగశ్రీదేవి(కిర్లంపూడి), కె.ఆకాంక్ష(వేళంగి), కె.రాణి, పి.జ్యోతి(రామచంద్రపురం), ఎస్.ఐశ్వర్య, డి.చంద్రకళ(ఆలమూరు), ఎన్.దీప్తి(రావులపాలెం) జిల్లా టేబుల్ టెన్నిస్ బాలుర విభాగంలో ఎండీ ఫిరోజ్, ఎం.బద్రీప్రకాష్(రాజమహేంద్రవరం), జి.కిశోర్, ఎం.వినోద్‌కుమార్(అమలాపురం), జి.వెంకటస్వామి(రామచంద్రపురం) టేబుల్‌టెన్నిస్ బాలికల విభాగంలో డి.సాయిదీక్షిత(తుని), పీఎస్ఆర్ఎస్ సరాజిత, ఎం.ప్రజ్వల, పి.వైష్ణవి(కాకినాడ), షేక్ జహీరా షిహార్(రామచంద్రపురం) జిల్లా జట్లకు ఎంపికైన ఈక్రీడాకారులు రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొంటారని జిల్లాస్కూలు గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తాతబ్బాయి తెలిపారు. హైస్కూల్ హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భారత సైనికుల పాత్ర అభినందనీయం
కాకినాడ రూరల్: పాకిస్థాన్ అనుసరిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడంలో అద్భుత ప్రతిభను కనబరచిన భారత సైని కుల పాత్ర అభినందనీయమని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద సరస్వతి స్వామి అన్నారు. ఆయన శుక్రవారం రమణయ్యపేటలోని శ్రీపీఠంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత సైనికుల సంక్షేమం కోసం దసరా ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తామన్నారు. నాలుగు నెలలపాటు తాను అమెరికాలో పర్యటించినట్టు ఆయన తెలిపారు. అమెరికన్లు భారత్‌లో పండుతున్న పసుపుతో చేసిన మాత్రలు వాడి వారి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారన్నారు. అయితే మన దేశంలో అమెరికా ప్రవేశపెడుతున్న బర్గర్లు, పిజ్జాలు వంటివి తిని, వారి మందులను వాడి ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కోటికుంకుమార్చన నిర్వహిస్తున్నామన్నారు. శ్రీపీఠం ఆధ్వర్యంలో ఏడు ఎకరాల్లో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేసి దేశవాళీ ఆవులను పెంచుతామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకు ఒక ఆవు, దూడను అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దేశంలో 32 రకాల జాతులకు చెందిన ఆవులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 13కి పడిపోయిందన్నారు. ఆవు జాతులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.