- మరో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సన్నాహాలు
- మొదటి పెట్రోల్ బంక్‌లో పెరిగిన అమ్మకాలు
- సంవత్సరానికి కోట్లలో టర్నోవర్
చెరసాలకు చమురు సిరి
Published Sun, Dec 4 2016 11:17 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
రాజమహేంద్రవరం క్రైం :
సెంట్రల్ జైల్ ఆధ్వర్యంలో మరో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐఓసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లాభాల బాటలో పయనించడంతో జైళ్ల శాఖ మరో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మొదటి పెట్రోల్ బంక్ రోజుకు సుమారు 15 లక్షల వరకూ వ్యాపారం చేస్తున్నది. రెండో బంక్‌కు ఉద్యాన వన శాఖ కార్యాలయం వద్ద ఉన్న స్ధలాన్ని కేటాయించేందుకు పెట్రోలియం సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ బంక్‌ను హెచ్‌పీసీఎల్ కు కేటాయించేందుకు అధికారులు చర్చిస్తున్నారు.
రికార్డు స్థాయిలో అమ్మకాలు
మొదటి పెట్రోల్ బంక్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగుతున్నాయి. ఈ ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ బెస్ట్ గ్రోత్ అవార్డు సాధించింది. ప్రస్తుతం పెట్రోల్ బంక్ ను మరింత ఆధునికీకరించి 2250 మీటర్ల స్థలంలో 6 పంపులతో మరింత పెంచుతున్నారు. ఈ పెట్రోల్ బంక్‌తో ఖైదీలకు, జైల్‌కు కూడా మంచి ఆదాయం లభిస్తోంది. జైళ్లశాఖ స్థలాన్ని 28 ఏళ్లకు సంవత్సరానికి రూ 53 వేలు చొప్పున ఐఓసిఎల్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ లీజు రూ 1.10 లక్షలకు పెరిగింది. దీనితో పాటు ఈ బంక్‌లో విక్రయించే ప్రతి లీటరు పెట్రోల్‌కు రూ.2.25 పైసలు, డీజల్‌కు రూ.1.20 పైసలు చొప్పున జైళ్లశాఖకు కమీష¯ŒS లభిస్తోంది. దీనితో పాటు ఖైదీలకు ఉపాధి లభిస్తుంది. గతంలో మూడు షిఫ్ట్‌లకు 18 మంది ఈ బంక్‌లో పని చేసేవారు. ప్రస్తుతం పెంచిన బంక్‌ను బట్టి మరో 20 మంది వరకూ పని చేసేందుకు అవకాశం ఉంది.
Advertisement