న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్‌ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్‌గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు.
ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ
Comments
Please login to add a commentAdd a comment