trump tower
-
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్‌ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్‌గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ -
ట్రంప్ అడ్రస్ మారింది!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అడ్రస్‌ను పర్మినెంట్‌గా మార్చనున్నారు. ప్రస్తుతం ఉంటున్న న్యూయర్ నగరం నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌కు తన చిరునామాను మార్చుకోనున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. "నేను నా కుటుంబం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌ను మా శాశ్వత నివాసంగా మార్చుకోబోతున్నాం.నేను న్యూయార్క్ ప్రజలను ఎంతో ఆదరిస్తాను. నేను ప్రతి సంవత్సరం నగరానికి పన్నుల రూపంలో మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ, నన్ను రాజకీయ నాయకులు చాలా ఘోరంగా చూశారు. కొద్దిమంది చాలా దారుణంగా వ్యవహరించారు. నాకు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధగా ఉంది కానీ చివరికి ఇదే సరియైనది అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎప్పటికీ నా హృదయంలో న్యూయర్క్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంటుంది" అని ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా, ట్రంప్ స్థానికంగా న్యూయార్క్ నగరానికి చెందినవాడైనప్పటికి ఆయన భార్య మెలానియాట్రంప్ తమ ప్రాథమిక నివాసాన్ని మాన్హాటన్ నుండి పామ్ బీచ్‌కు మారుస్తూ సెప్టెంబరులో వ్యక్తిగత నివాస ప్రకటనలను దాఖలు చేశారు. ట్రంప్‌కు న్యూయర్ నగరంలో ఎప్పుడూ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ట్రంప్ నివాసమైన ట్రంప్ టవర్స్ వద్ద ప్రజలు నిరసనలు తెలుపుతూ ఉండే వారు.. దీంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తన చిరునామా మార్చడానికి గల కారణాలను తెలియజేయడానికి వైట్‌హౌస్ వర్గాలు నిరాకరించాయి. అయితే ట్రంప్‌కు సన్నిహతంగా ఉండే వారి సమాచారం ప్రకారం పన్నులకు సంబంధించిన విషయంలో ట్రంప్ తన నివాసాన్ని మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. -
ట్రంప్ టవర్‌లో మరోసారి కలకలం
న్యూయార్క్: న్యూయార్క్‌లోని ట్రంప్ ట్రవర్స్‌లో మరోసారి కలకలం రేగింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన మాన్‌హట్టన్‌లోని టవర్‌వద్ద శుక్రవారం కనిపించిన పలు అనుమానాస్పద ప్యాకేజీలు న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెమటలు పట్టించాయి. ప్రాథమికు పరిశీలన అనంతరం ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్లో ప్రకటించింది. ట్రంప్ సొంతమైన 58 అంతస్థుల భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను భద్రతా సిబ్బంది గమనించారు. అనంతరం జరిపినవిస్తృత పరిశోధన మరో రెండు ప్యాకెట్లు లభించడంతో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌ని పిలిపించి తనిఖీలు చేపట్టారు. భవనంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులను గమనించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎన్‌వైపీడీ ప్రజాసమాచార అధికారి సెర్జెంట్ విన్సెంట్ మార్చీజ్ తెలిపారు. The situation at Trump Tower (725 5th Ave, #Manhattan) has been assessed. There is no danger at this time. — NYPD NEWS (@NYPDnews) July 27, 2018 -
ట్రంప్ టవర్‌లో అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ట్రంప్ టవర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూలో ఉన్న ట్రంప్ టవర్లోని 50వ అంతస్తులో శనివారం రాత్రి 7 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 50వ అంతస్తులో నివాసం ఉండే టాడ్ బ్రాస్నెర్(67) అనే వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత అతడు చనిపోయాడని అధికారులు తెలిపారు. మొత్తం 58 అంతస్తులున్న ట్రంప్ టవర్‌లో ట్రంప్ వ్యాపార సంస్థల ప్రధాన కార్యాలయం 26వ అంతస్తులో ఉంది. -
ట్రంప్ టవర్ 50వ అంతస్థులో అగ్నిప్రమాదం..
-
ట్రంప్ టవర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ టవర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలైనట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ 50వ అంతస్థులో గత రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హుటాహుటినా భవనంలోని వారిని ఖాళీ చేయించారు. అయితే ప్రమాదంలో 67 ఏళ్ల వృద్ధుడొకరు పొగ కారణంగా ఊపిరాడక స్పృహ కోల్పోగా.. ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది నలుగురు గాయపడినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. కాగా, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్లో స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ... సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు. Fire at Trump Tower is out. Very confined (well built building). Firemen (and women) did a great job. THANK YOU! — Donald J. Trump (@realDonaldTrump) 7 April 2018 -
ట్రంప్ టవర్స్‌లో అగ్ని ప్రమాదం
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ టవర్స్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రంప్ టవర్స్‌లో పలు కార్యాలయాలతో పాటు, సాధారణ నివాసాలు కూడా ఉన్నాయి. టవర్స్ పై అంతస్తులో ప్రమాదం జరగడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ అపాయం కలుగలేదని రిపోర్టులు వస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
త్వరలో మళ్లీ ట్రంప్ టవర్ అమ్మకాలు
ముంబయి: ముంబయిలోని ట్రంప్ టవర్ అమ్మకాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. 2019నాటికి టవర్ మొత్తాన్ని విక్రయించాలని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ లోధా గ్రూప్ ప్రకటించింది. సౌకర్యవంతమైన విల్లాల విక్రయ మార్కెట్లో లోధా గ్రూప్ ముందుంటుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో టవర్ అమ్మకాలను ఆపివేశారు. మొత్తం 75 అంతస్థుల ఈ భవనంలో 60శాతం ఇప్పటికే విక్రయించామని, మిగితా మొత్తాన్ని 2019నాటికి పూర్తి స్థాయిలో విక్రచయించాలనుకుంటున్నట్లు లోధా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా చెప్పారు. ‘ట్రంప్ విజయం సాధించిన వెంటనే ట్రంప్ టవర్ మొత్తాన్ని విక్రయించకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజకీయ పరమైన మార్పుల దృష్ట్యా ఇది ఎలాంటి సంకేతాన్నైనా ఇవ్వొచ్చు అని ఆపేశాం’ అని ఆయన చెప్పారు. జూన్ లేదా జూలై నెలలో విక్రయాలు జరపాలని అనుకుంటున్నామని, అప్పుడే తగిన సమయం అని తాము భావిస్తున్నామని తెలిపారు. -
ట్రంప్ టవర్స్ సీక్రెట్ ల్యాప్‌టాప్ చోరి
-
ట్రంప్ టవర్స్ సీక్రెట్ ల్యాప్‌టాప్ చోరి
న్యూయార్క్: ట్రంప్ టవర్ కు సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారమున్న సీక్రెట్ సర్విస్ ల్యాప్‌టాప్ దొంగతనానికి గురైంది. సీక్రెట్ సర్విస్ ఏజెంట్స్ కారు నుంచి బ్రూక్లిన్ లో దీని చోరి జరిగింది. ఈ ల్యాప్ టాప్ లో ట్రంప్ టవర్ కు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ తో పాటు ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ మెయిల్స్ వాడకానికి చెందిన క్రిమిషనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు కూడా ఉన్నాయని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. దేశ భద్రతకు సంబంధించిన వివరాలు దానిలో ఉన్నాయని గార్డియన్ రిపోర్టు చేసింది. గురువారం ఉదయం ఏజెంట్ వాహనం నుంచి ఈ ల్యాప్ టాప్ దొంగతనానికి గురైంది. అప్పటినుంచి అధికారులు దీని వెతుకులాటలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాని ఆచూకీ లభ్యం కాలేదు. ల్యాప్ టాప్ తో పాటు మరికొన్ని వస్తువులను కూడా దొంగలు తస్కరించారు. కాయిన్స్, బ్లాక్ బ్యాగ్ వంటిని వారు తీసుకెళ్లారు. కానీ అవి రికవరీ అయినట్టు తెలిసింది. పోప్ ఫ్రాన్సిస్ కు చెందిన పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు దానిలో ఉన్నాయి. అయితే కట్టుదిట్టమైన భద్రతతో ఈ ల్యాప్ టాప్ ను సీక్రెట్ సర్వీసు జారీచేస్తోంది. ఫుల్ డిస్క్ ఎన్స్క్రిప్షన్ ఇది కలిగి ఉంటుందని సీక్రెట్ సర్వీసు అధికార ప్రతినిధి కేథి మిల్హోన్ తెలిపారు. -
ట్రంప్ టవర్ వద్ద ఆందోళనలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో గల ట్రంప్ టవర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన ట్రంప్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో.. తమకు అధ్యక్షుడిగా ట్రంప్ వద్దని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ప్రపంచ గురించి ట్రంప్‌కు సరైన అవగాహన లేదని అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని ఓ నిరసనకారి వ్యాఖ్యానించింది. ట్రంప్ తన సొంత ప్రయోజనాల కోసం అధ్యక్ష పదవిని వినియోగించుకుంటారని పేర్కొంది. -
ట్రంప్ టవర్‌లో బ్యాగ్ కలకలం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన 58 అంతస్తుల భవంతి (ట్రంప్ టవర్)లో ఒక అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. న్యూయార్క్ లోని ఈ భారీ భవంతి లాబీలో బుధవారం ఆ బ్యాగ్ కనుగొన్నతర్వాత.. హుటాహుటిన భవంతిని ఖాళీ చేయించారు. ఆ బ్యాగ్‌లో ఆటబొమ్మలు మాత్రమే ఉన్నాయని బాంబు నిర్వీర్య సిబ్బంది తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తన కుటుంబంతో కలసి వచ్చిన ఒక బాలుడు ఆ బ్యాగ్ వదిలివెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. అనుమానాస్పద బ్యాగ్‌తో ఏర్పడ్డ కలకలం సర్దుకుంది అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. -
ట్రంప్ టవర్ లో బాంబు కలకలం
న్యూయార్క్: ట్రంప్ టవర్ లో బాంబు కలకలం రేగింది. గుర్తు తెలియని బ్యాగు పడి ఉండటాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే బిల్డింగును తాత్కాలికంగా ఖాళీ చేయించారు. బాంబు కలకలంతో బాంబు స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. సంచిని తనిఖీ చేసి అందులో ఉన్నవి ఆడుకునే బొమ్మలని తేల్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. మాన్‌హట్టన్‌లోని ట్రంప్ టవర్స్ నుంచి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డేవిస్ మాట్లాడుతూ బాంబ్ స్క్వాడ్ సంచిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. కాగా, అధ్యక్షపదవిని స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఇక్కడే నివసించనున్నారు. ఆయన ప్రస్తుతం ఫ్లోరిడాలో క్రిస్మస్ సెలవుల్లో ఉన్నారు. -
ట్రంప్‌కు సీక్రెట్ రక్షణ సిబ్బంది ఎందరో తెలుసా?
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ భద్రత కోసం రహస్య రక్షణ సిబ్బంది ట్రంప్ టవర్స్‌లోని రెండు అంతస్తులు కోరారు. కొద్దికాలంపాటు ట్రంప్ ఇక్కడే ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 250మంది ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలు చూడనున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఎక్కడ ఉండాలి? ఎలా విధులు నిర్వర్తించాలి? ఆయనను కలిసేందుకు వచ్చే వ్యక్తులుపై ఎలాంటి నిఘా నిర్వహించాలి? అనే తదితర అంశాలపై ఆ విభాగం ట్రంప్ తో ప్రత్యేకంగా భేటీ అయింది. (చదవండి: టీమ్ ట్రంప్..!) ట్రంప్, ఆయన భార్య మిలానియా, పదేళ్ల కుమారుడు ట్రంప్ టవర్స్‌లోని పై అంతస్తులో ఉన్న ట్రిప్లెక్స్ బెడ్ రూంలో వసంతకాలమంతా ఉండనున్నారు. దీంతో ప్రత్యేక రహస్య రక్షణా సిబ్బందితోపాటు, న్యూయార్క్ పోలీస్ శాఖకు చెందిన అధికారులు 40 అంతస్తుల కింద రెండు అంతస్తుల్లో గస్తీ పోస్టు ఏర్పాటు చేసుకొని విధులు నిర్వర్తించాలని భావిస్తున్నారు. ఇందుకు ట్రంప్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ టవర్ లో 26 ప్లోర్లు వ్యాపార సముదాయాలే ఉన్నాయి. మిగితావన్నీ కూడా నివాస సముదాయాలు. గతంలో ట్రంప్ రక్షణ బాధ్యతలు 17వ ఫ్లోర్ నుంచి చూసేవారంట. -
ట్రంప్ టవర్‌కు ఫుల్ క్రేజ్
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన నివాసం, వ్యాపార సముదాయం ట్రంప్ టవర్‌కు ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. టూరిస్టు ప్రాంతాలకంటే ఆ టవర్ ముందే ఇటు స్వదేశీయులతోపాటు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) అంటే ఎంతటి మోజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు వినూత్నంగా సెల్ఫీలు దిగడం పరిపాటే. ఆ అలవాటులో భాగంగానే ఇప్పుడు న్యూయార్క్ లో ప్రతి ఒక్కరు ట్రంప్ టవర్ ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎంతలా అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులకు ఇక చాలు వెళ్లండి అని రోజంతా చెప్పలేక విసుగొచ్చేస్తుందంట. అంతేకాదు వీరికి అదనంగా తాజాగా పోలీసులు కూడా అక్కడ పెద్ద మొత్తంలో భద్రత నిమిత్తం చేరి ఆంక్షలు పెడుతున్నప్పటికీ సెల్ఫీలు మాత్రం ఆపడం లేదంట. ఎన్నికల నిర్వహణ తేది ప్రకటించినప్పటి నుంచి ఈ తంతు మొదలైందని, ఇప్పుడు ట్రంప్ విజయం సాధించడంతో అది కాస్త మరింత ఎక్కువై ఈ మధ్య సిమెంట్ మెటల్ రెయిలింగ్ కూడా ఏర్పాటు చేశారు.