ట్రంప్‌కు సీక్రెట్ రక్షణ సిబ్బంది ఎందరో తెలుసా? | Secret Service may take over 2 floors for Trump Tower security | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు సీక్రెట్ రక్షణ సిబ్బంది ఎందరో తెలుసా?

Published Fri, Nov 25 2016 12:49 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్‌కు సీక్రెట్ రక్షణ సిబ్బంది ఎందరో తెలుసా? - Sakshi

ట్రంప్‌కు సీక్రెట్ రక్షణ సిబ్బంది ఎందరో తెలుసా?

న్యూయార్క్‌: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ భద్రత కోసం రహస్య రక్షణ సిబ్బంది ట్రంప్‌ టవర్స్లోని రెండు అంతస్తులు కోరారు. కొద్దికాలంపాటు ట్రంప్‌ ఇక్కడే ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 250మంది ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలు చూడనున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఎక్కడ ఉండాలి? ఎలా విధులు నిర్వర్తించాలి? ఆయనను కలిసేందుకు వచ్చే వ్యక్తులుపై ఎలాంటి నిఘా నిర్వహించాలి? అనే తదితర అంశాలపై ఆ విభాగం ట్రంప్‌ తో ప్రత్యేకంగా భేటీ అయింది. 

(చదవండి: టీమ్ ట్రంప్..!)

ట్రంప్, ఆయన భార్య మిలానియా, పదేళ్ల కుమారుడు ట్రంప్ టవర్స్లోని పై అంతస్తులో ఉన్న ట్రిప్లెక్స్ బెడ్‌ రూంలో వసంతకాలమంతా ఉండనున్నారు. దీంతో ప్రత్యేక రహస్య రక్షణా సిబ్బందితోపాటు, న్యూయార్క్ పోలీస్‌ శాఖకు చెందిన అధికారులు 40 అంతస్తుల కింద రెండు అంతస్తుల్లో గస్తీ పోస్టు ఏర్పాటు చేసుకొని విధులు నిర్వర్తించాలని భావిస్తున్నారు. ఇందుకు ట్రంప్‌ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ టవర్ లో 26 ప్లోర్లు వ్యాపార సముదాయాలే ఉన్నాయి. మిగితావన్నీ కూడా నివాస సముదాయాలు. గతంలో ట్రంప్‌ రక్షణ బాధ్యతలు 17వ ఫ్లోర్ నుంచి చూసేవారంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement