ట్రంప్ టవర్ వద్ద ఆందోళనలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో గల ట్రంప్ టవర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన ట్రంప్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో.. తమకు అధ్యక్షుడిగా ట్రంప్ వద్దని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ప్రపంచ గురించి ట్రంప్‌కు సరైన అవగాహన లేదని అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని ఓ నిరసనకారి వ్యాఖ్యానించింది. ట్రంప్ తన సొంత ప్రయోజనాల కోసం అధ్యక్ష పదవిని వినియోగించుకుంటారని పేర్కొంది.