కోల్‌కతా: నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మమత చేసిన వ్యాఖ్యలపై వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.
‘విదేశి వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి ఆశ్రయం కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. విదేశాల నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని సూచిస్తుంది. సీఎం మమత వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ ఆర్టికల్ 167 ప్రకారం వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.’అని రాజ్‌భవన్ మీడియా సెల్ ‘ఎక్స్’లో పేర్కొంది.
HG has sought a report under Article 167 on the reported comment made by Chief Minister publicly on 21.07.2024:
“…But I can tell you this, if helpless people come knocking on the doors of Bengal, we will surely provide them shelter.”
Close on its heels came Government of India’s…— Raj Bhavan Media Cell (@BengalGovernor) July 22, 2024
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Comments
Please login to add a commentAdd a comment