
సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క రోజు తర్వాత తమిళనాడు గవర్నర్ రవిని కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం రజనీకాంత్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రవితో దాదాపుగా 30 నిమిషాల సేపు మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని రజనీకాంత్ కలిశారని వార్తలొచ్చాయి.
గవర్నర్ భేటీ అయిన తలైవా సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయాలపైనే గవర్నర్‌తో చర్చించానని చెప్పారు. అయితే తానేం మాట్లాడానో మీడియాకు వెల్లడించలేనన్నారు. తనకు భవిష్యత్‌లో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ వడ్డించడం గురించి విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న
Comments
Please login to add a commentAdd a comment