
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట ల వరకు రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫి క్ చీఫ్ అనిల్‌కుమార్ సూచించారు. ఇఫ్తార్ విందు కు హాజరయ్యే వారి వాహనాలకు రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ స్టేషన్, మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్ మధ్య, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా పార్కింగ్ ప్రాంతాలు కేటాయించామన్నారు.