
కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ద్రౌపదీ ముర్ము
శుక్రవారం శిల్పకళావేదికలో లోక్ మంథన్‌కు హాజరు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: రెండురోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. గురు, శుక్రవారాల్లో (21, 22వ తేదీల్లో) ఆమె హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అటునుంచి రాజ్‌భవన్‌కు చేరుకొని 6.20 గంటల నుంచి 7.10 వరకు విశ్రాంతి తీసుకొంటారు.
రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని, అక్కడ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు శిల్పకళా వేదికలో జరుగుతున్న ‘లోక్ మంథన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మ ధ్యాహ్నం 12.05 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.

Comments
Please login to add a commentAdd a comment