TS: గవర్నర్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు | Asaduddin Owaisi Comments On TS Governor Tamilisai Over PRO | Sakshi
Sakshi News home page

TS: గవర్నర్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Published Fri, Apr 22 2022 8:04 PM | Last Updated on Sat, Apr 23 2022 2:56 PM

Asaduddin Owaisi Comments On TS Governor Tamilisai Over PRO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్‌ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ చేస్తున్న ఫిర్యాదులు చేయగా.. రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.

అయితే ఇటీవల గవర్నర్‌ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో గవర్నర్‌ సైతం కేంద్రానికి పలు ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో వ్యహరిస్తున్న తీరును బీజేపీ తప్పుపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement