
సాక్షి, చెన్నై: గవర్నర్‌గా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేస్తానని భన్వరీలాల్ పురోహిత్ తెలిపారు. తమిళనాడు నూతన గవర్నర్‌గా పురోహిత్ శుక్రవారం చెన్నైలో ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కార్యక్రమానికి హాజరై నూతన గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కొణిజేటి రోశయ్య పదవీకాలం పూర్తయ్యాక తమిళ రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరగలేదు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ఇన్నాళ్లూ ఇంఛార్జ్ గవర్నర్‌గా వ్యవహరించారు. తాజాగా పురోహిత్‌ను తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. పురోహిత్ గతంలో అసోం గవర్నర్‌గా పనిచేశారు. అభివృద్ధి పనుల్లో తమిళనాడు సర్కార్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భన్వరీలాల్ పురోహిత్ తెలిపారు.