చైన్నె కామిక్‌ కాన్‌ – 2025 | - | Sakshi
Sakshi News home page

చైన్నె కామిక్‌ కాన్‌ – 2025

Published Mon, Feb 10 2025 1:49 AM | Last Updated on Mon, Feb 10 2025 6:45 AM

-

సాక్షి, చైన్నె: చైన్నె నందంబాక్కం ట్రేడ్‌సెంటర్‌ వేదికగా శని, ఆదివారాలలో కామిక్‌ కాన్‌ – 2025 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా యమహా యాక్షన్‌ – ఫ్యాక్ట్‌ షోకేస్‌ను కొలువుదీర్చారు. భారతదేశంలోనే అతిపెద్ద పాప్‌ సాంస్కృతిక కార్యక్రమం కామిక్‌ కాన్‌ నిలవడమే కాకుండా గొప్ప సాంస్కృతిక, వారసత్వం, డైనమిక్‌ ఆటోమోటివ్‌ పరిశ్రమ, ఉద్వేగభరితమైన అభిమానుల సంఘాల నగరం కళ, జీవనశైలి ఆవిష్కరణలతో అద్బుత వేడుకను నిర్వహించారు. ఇందులో యమహా ఎక్స్‌పీరియనన్స్‌ జోన్‌ ప్రధాన హైలైట్‌గా నిలిచింది, సందర్శకులు వర్చువల్‌ రేసింగ్‌ అనుభవాన్ని, గేమింగ్‌లో వచ్చే తమకు నచ్చిన వారి వేషాధారణలో అలరించారు. కంపెనీ కామిక్‌ కాన్‌ సూపర్‌ ఫ్యాన్‌ బాక్స్‌, యమహా ప్రత్యేకమైన కామిక్‌ కాన్‌ థీమ్డ్‌ వస్తువులు ఔత్సాహికులను అలరించాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
మరోసారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అజిత్‌ 1
1/1

మరోసారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అజిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement