పీఎంకు లేఖ రాసేందుకు ముందుగా సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో కొత్త రోడ్లు వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి పనులను ప్రభుత్వం విస్తృత చేసిన విషయం తెలిసిందే. చెంగల్పట్టు – తిరువణ్ణామలై, సెయ్యూరి రహదారి విస్తరణ, పనయూర్ లింక్ రోడ్డుతో సహా సెయ్యూర్–వందవాసి–పోలూర్ రోడ్డు పనులు ప్రస్తుతం ముగించారు. మరుతడు, వందవాసి, సేతుపట్టులలో బైపాస్‌రోడ్డుల ఏర్పాటు, హై లెవల్ వంతెనలు, రోడ్డుకు ఇరు వైపులా 47,700 మొక్కలు పెంపకం వంటి వంటి పనులు ముగించారు.
చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారిలోని తూర్పు వైపున సముద్ర తీర రోడ్డును విల్లుపురం–మంగళూరు జాతీయ రహదారి అనుసంధానించే విధంగా మరుతడు, వందవాసి, సేతుపట్టులలో బైపాస్ రోడ్డులను ఏర్పాటు చేశారు. చెంగల్పట్టు– తిరువణ్ణామలైలలోని 67 గ్రామాలకు రవాణాను సులభతరం చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ పనులన్నింటినీ సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహదారుల శాఖమంత్రి ఏవీ వేలు, కార్యదర్శి ఆర్. సెల్వరాజ్, చైన్నె–కన్యాకుమారి ఇండస్ట్రియల్ ఏరియా ఆఫీస్‌ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర పాండియన్, చీఫ్ ఇంజినీర్ డి. జెబాసెల్విన్ పాల్గొన్నారు.
అలాగే తమిళనాడు వినియోగదారులు, ఆహార సరఫరా విభాగం నేతృత్వంలో రూ. 92.45 కోట్లతో నిర్మించిన 6 గిడ్డంగులు ,11 ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలు, 4 పైకప్పు నిర్మాణంతో ఆధునిక బియ్యం నిల్వ సౌకర్యాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రూ. 10.20 కోట్ల అంచనా వ్యయంతో 6 వృత్తాకార ప్రాసెసింగ్ గిడ్డంగుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వేలు, పెరియకరుప్పన్, చక్రపాణి, టి.ఆర్.బీ. రాజ, ప్రధాన కార్యదర్శి మురుగానందం, వినియోగదారుల రక్షణ శాఖ కార్యదర్శి సత్యప్రద సాహూ, రిజిస్టార్ నందకుమార్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ బర్తడే మరి కొద్ది రోజుల్లో జరగనుది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్టాలిన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో ఆయన సతీమని దుర్గా స్టాలిన్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది పాటూ రోజుకు 1000 మంది అన్నదానం దిశగా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment