
సాక్షి,సిటీబ్యూరో: కోవిడ్ సమయంలో పేదలకు సేవ చేయడంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ చేసిన కృషి ఎనలేనిదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసించారు. డి.ఇ.షా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సేవా భారతి భాగస్వామ్యంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సేవా భారతి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యక్షురాలు ఉషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.