ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను సోమవారం ఆయన కలువనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ఈ పర్యటనలో ఆయన కేంద్రానికి వివరించనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు సైతం ఈ పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.