
చంఢీఘర్: పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ గవర్నర్ పదవి, కేంద్ర పాలిత ప్రాంతం ఛండీఘర్ అడ్మినిస్ట్రేటర్ పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పంపిన రాజీనామా పత్రంలో.. తన రాజీనామాను దయచేసి అంగీకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం పంపిన పలు బిల్లులను ఆమోదించటంలో జాప్యం చేస్తున్న నేపథ్యంలో బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ పదవి రాజీనామా చేశారు. నవంబర్ 10, 2023లో పంజాబ్ అసెంబ్లీ పంపిన ఐదు బిల్లులను బన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలపకుండా జాప్యం చేశారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయటాన్ని నిలదీసింది.
అప్పటి నుంచి పంజాబ్ ప్రభుత్వానికి.. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం చంఢీఘర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక.. అమిత్ షాను కలిసిన మరుసటి రోజు బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ పదవికి రాజీనామా చేయటంపై చర్చ జరుగుతోంది.
Punjab Governor and Chandigarh Administrator Banwarilal Purohit resigns due to "personal reasons and certain other commitments." pic.twitter.com/0o05k6Hn6p
— ANI (@ANI) February 3, 2024