హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు షర్మిల.
‘కాళేశ్వరం మూడేళ్లలో మునిగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన మోసం, అబద్ధం. దేవాదుల చెక్కుచెదరలేదు.. కాళేశ్వరం మాత్రం మునిగిపోయింది. రూ. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టుతో ఏం సాధించారు. కాంక్రీటుతో కట్టాల్సిన ప్రాజెక్టులు బ్రిక్స్, మట్టితో కట్టారు’ అని ఆరోపించారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర‍్మిల.
ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాల భర్తీ అంకెల గారడీ : వైఎస్ షర్మిల
Comments
Please login to add a commentAdd a comment