రేపు జిల్లాకు కొత్త గవర్నర్‌ రాక | Arrival of the New Governor To the Chittoor district tomorrow | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు కొత్త గవర్నర్‌ రాక

Published Mon, Jul 22 2019 8:53 AM | Last Updated on Mon, Jul 22 2019 8:53 AM

Arrival of the New Governor To the Chittoor district tomorrow - Sakshi

విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 23వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. మొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ షెడ్యూల్‌ ఆదివారం  కలెక్టరేట్‌కు అందింది. గవర్నర్‌ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త ఆయా శాఖల ప్రొటోకాల్‌ అధికారులను ఆదేశించారు.

షెడ్యూల్‌ ఇలా..
గవర్నర్‌ హరిచందన్‌ ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో తిరుమలకు చేరుకుని, శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల నుంచి బయలుదేరి సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement