
నేడు గవర్నర్‌తో టీటీడీపీ నేతల భేటీ
టీటీడీపీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు గవర్నర్‌తో భేటి కానున్నట్లు ఎల్.రమణ తెలిపారు.
కరీంనగర్ జిల్లా రాయికల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి తన కుటుంబ ప్రయోజనాల కోసం గత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు పదహారుసార్లు హైకోర్టు ప్రభుత్వానికి పలు జీవోలపై మొట్టికాయ వేసిందని గుర్తుచేశారు. ఎంసెట్ లీకేజీ నైతిక బాధ్యత వహిస్తూ విద్య, వైద్యశాఖ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులతో గవర్నర్‌తో కలిసివినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.