![Governer Wishesh to JNTUH Student Rajesh kanna - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/4/rajesh.jpg.webp?itok=O39gqd4S)
రాజేష్ కన్నా
కేపీహెచ్‌బీకాలనీ: లాక్‌డౌన్ సందర్భంగా ‘కనెక్ట్– చాన్సలర్’’ పేరుతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన జేఎన్టీయూహెచ్ రిసెర్చ్ స్కాలర్ రాజేష్ కన్నాను
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంస పత్రంతో అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రశంసపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోని విద్యార్థులకు కనెక్ట్– చాన్సలర్ పేరుతో పోటీలను నిర్వహించగా రాజేష్‌ఖన్నా కవితలు, వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జేఎన్టీయూహెచ్‌లో స్కాలర్‌గానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన రచయితగా రాజేష్‌కన్నా ఇప్పటికే పలు పోటీల్లో ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా గవర్నర్ నిర్వహించిన పోటీల్లోనూ ప్రశంస పొందటం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment