
మమతా బెనర్జీ- కేసరినాథ్ త్రిపాఠి
కోల్‌కతా : బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రాసిన లేఖ అధికార పార్టీ, గవర్నర్ మధ్య వివాదానికి దారి తీసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను జరుపుకోవడానికి సన్నాహకాలు ముమ్మరం చేయాలని, ఈ ఏడాది యోగా డేను విజయవంతంగా జరపాలని గవర్నర్ త్రిపాఠి యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌లకు లేఖ రాశారు. గవర్నర్ తీరును అధికార తృణమూల్ తప్పుబట్టింది.
దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ..‘ యూనివర్సిటీలకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలను రావాలి. లేఖలు రాసే అధికారం వారికే ఉంటుంది. రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలపై గవర్నర్ జోక్యం తగదు. అలా చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడట్లే. యోగా డేను నిర్వహించాడానికి సీఎం మమత బెనర్జీ అన్ని ఏర్పాట్లు చేశారు’ అని అన్నారు. గవర్నర్ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నాని టీఎంసీ ఆరోపిస్తోంది. కాగా యోగా డే నిర్వహణపై గతంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది.