
బీజేపీలో చేరిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ చేరికతో బీజేపీకి మరింత బలం పెరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీ సీఎం ఎవరనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ కాషాయం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కిరణ్ బేడీ మాట్లాడుతూ... మోదీ పాలన తనలో స్పూర్తి నింపిదని ఆమె తెలిపారు. తానేప్పుడు పదవుల కోసం పని చేయడం లేదని ... తన జీవితం దేశానికే అంకితమని ఆమె స్పష్టం చేశారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా తన 40 ఏళ్ల అనుభవాన్ని ఢిల్లీ ప్రజలకు అర్పించేందుకే వచ్చానని కిరణ్బేడీ ఈ సందర్భంగా వెల్లడించారు.