ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి | 5 From Hindu Sena Arrested For Vandalising Asaduddin Owaisi Home | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి

Published Wed, Sep 22 2021 3:47 AM | Last Updated on Wed, Sep 22 2021 5:05 AM

5 From Hindu Sena Arrested For Vandalising Asaduddin Owaisi Home - Sakshi

న్యూఢిల్లీ: ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అధికారిక నివాసంపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు హిందూ సేన సభ్యులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని అశోక రోడ్డులో ఒవైసీ నివాసం ఉంది. ఈ దాడి గురించి సాయంత్రం 5 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement