Asaduddin Owaisi Delhi Home Attacked By Miscreants - Sakshi
Sakshi News home page

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ నివాసంపై దుండగుల దాడి

Published Mon, Feb 20 2023 7:25 AM | Last Updated on Mon, Feb 20 2023 8:38 AM

Owaisi Delhi Home Attacked By Miscreants - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్‌ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగింది. ఘటనాస్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్‌ సేకరించింది. ఘటనపై పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది. కాగా, ఒవైసీ రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే..

చదవండి: రింగ్‌ మాస్టర్‌కు ఝలక్‌.. నువ్వు లక్కీఫెలో భయ్యా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement