miscreants attack
-
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి
సాక్షి, ఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగింది. ఘటనాస్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ సేకరించింది. ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది. కాగా, ఒవైసీ రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. చదవండి: రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా! -
ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. జేజే కాలనీలో సోమవారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ముఖాలకు మాస్క్‌లు వేసుకోవటం ద్వారా దుండగులను గుర్తించలేకపోయినట్లు స్థానికులు తెలిపారు. కాల్పుల ఘటనపై వివరాలు వెల్లడించారు బాధితుడి సోదరుడు. ‘ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మా సోదరుడు, ఆయనతో కూర్చున్న ఇద్దరు వృద్ధులపై కాల్పులకు పాల్పడినట్లు మా పొరుగింటివారు చెప్పారు.’ అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Delhi | Unidentified persons open fire in JJ Colony area The neighbours informed me that 2 people came with covered faces & fired at my brother & 2 other older men who were sitting with him. Police told us 2 killed, incl my brother, & 1 is seriously injured: Brother of deceased pic.twitter.com/jGPxsW0ZJ8 — ANI (@ANI) August 22, 2022 ఇదీ చదవండి: నాన్‌వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా? -
50 కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి.. ఆపై
బెంగళూరు: రోజురోజుకూ మానవత్వం మంట కలసిపోతోంది. కొందరు మానవత్వాన్ని మరిచి మూగ జీవుల ప్రాణాలను తీస్తూ పాపం మూటగట్టుకుంటున్నారు. తాజాగా కోతులకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా బెలూర్ సమీపం చౌడనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు..గురువారం ఉదయం స్ధానిక యువకులు రోడ్డు పక్కన గోనెసంచుల మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా అందులో కోతులు కనిపించాయి. అయితే అప్పటికే కొన్ని మృత్యవాత పడగా, మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. సంచులలో ఉన్న వానరాల్లో 30 కోతులు చనిపోగా.. మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. స్థానికులు గాయపడిన కోతులను బయటకు తీసి నీళ్లు తాగించడంతో 20 కోతుల్లో 18 కోలుకొని ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయాయి. ఘటనపై సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులను వేరే చోటుకు రవాణా చేసే క్రమంలో వారి ప్రణాళికలు విఫలమైనందున ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన కోతులకు పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో విషం ఆనవాళ్లు ఉన్నట్లు తేలినట్లు ఆధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణ్‌దీప్ హుడా ట్విటర్లో షేర్ చేస్తూ విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. In an absolutely heinous act, more than 60 monkeys were poisoned, tied in bags and thrown on Sakleshpur Begur Crossroad in Hassan District, Karnataka. @moefcc @byadavbjp @aranya_kfd @CMofKarnataka pic.twitter.com/VqHv0Oew8v — Randeep Hooda (@RandeepHooda) July 29, 2021 -
అమెరికాలో దారుణం
సిన్సినాటి: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే సిక్కు కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఓహియో రాష్ట్రంలో చోటుచేసుకుంది. సిన్సినాటిలోని వెస్ట్చెస్టర్ టౌన్‌షిప్‌కు చెందిన హకీకత్ సింగ్ పనాగ్, ఆయన భార్య పరమ్‌జిత్ కౌర్, కూతురు షాలిందర్ కౌర్, కోడలు అమర్జిత్ కౌర్ ఆదివారం రాత్రి భోజనానికి ఉపక్రమిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారంతా అక్కడికక్కడే చనిపోయారు. కొద్దిసేపటి అనంతరం ఇంటికి చేరుకున్న హకీకత్‌సింగ్ కుమారుడు కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి వెంటనే 911 పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. ‘మృతుల్లోనే నేరగాడు ఉన్నట్లు గానీ, ఎదురుకాల్పులు జరిగినట్లు గానీ మేం భావించడం లేదు. ఈ ఘటనకు కారణాలు, కారకులెవరు అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం గాలిస్తున్నాం’ అని పోలీస్ చీఫ్ హెర్జోగ్ అన్నారు. ఈ ఘటనపై వెస్ట్ చెస్టర్లోని గురునానక్ సొసైటీ ఆఫ్ గ్రేటర్ సిన్సినాటి ప్రెసిడెంట్ జస్మిందర్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘హకీకత్ సింగ్ పనాగ్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనది చాలా మంచి కుటుంబం’ అని తెలిపారు. -
మంకీక్యాప్‌లు పెట్టుకుని.. కంట్లో కారం చల్లి..
నిజాంపట్నం(రేపల్లె)/సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా నిజాంపట్నంలో కిరాతకులు రెచ్చిపోయారు. ఒక వ్యక్తిని రాడ్లతో కొట్టి చంపారు. స్థానికుల కథనం ప్రకారం నిజాంపట్నం ఎక్స్ మిలటరీ కాలనీకి చెందిన శీలం మహిమ వర్ధన్ (46) గురువారం ఉదయం 8 గంటల సమీపంలో టీ తాగేందుకు బస్టాండ్ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంకీక్యాప్‌లు పెట్టుకుని వచ్చి మహిమవర్ధన్ కంట్లో కారం చల్లి రాడ్లతో తలపై కొట్టి హతమార్చారు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చిన మహిమ వర్ధన్ భార్య రత్నావళి, బంధువులు బాధ్యులపై చర్యలు తీసుకునేవరకూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసువెళ్లనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. అయితే ఈ హత్యకు భూ వివాదాలే కారణమని చెబుతున్నారు. 1973లో అప్పటి ప్రభుత్వం 124 మంది దళితులకు 186 ఎకరాలు పంపిణీ చేసింది. ఆ భూమిని ప్రస్తుతం పలువురు రైతులు సాగుచేస్తున్నారు. తమ భూమిని పెత్తందారులు లాక్కుని అనుభవిస్తున్నారని గతంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. ఈ వివాదాల నేపథ్యమే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటన విషయం తెలిసి వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, బంధువులను పరామర్శించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మృతుడి భార్య, బంధువులను పరామర్శించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మృతుడి కుటుంబానికి తన వంతు సాయంగా రూ. 5 లక్షలు అందించనున్నట్టు తెలిపారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ వరదరాజులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, మహిమవర్ధన్ హత్యకు టీడీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హత్యలో పాల్గొన్న వ్యక్తి టీడీపీ నేత బొమ్మిడి రామకృష్ణ ముఖ్య అనుచరుడని స్థానికులు చర్చించుకుంటున్నారు. హత్యలో టీడీపీ నేతల హస్తం ఉండటంతో వారిని తప్పించి వైఎస్సార్సీపీ నేతలపై మోపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
దారుణం : రైల్లోంచి గర్భిణి తోసివేత..!
సాక్షి, అనంతపురం : కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్య అనే గర్భిణిపై దుండగులు దాడికి దిగారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. వారి బారినుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దివ్యను నిర్దాక్షణ్యంగా రైలులోంచి తోసేశారు. ఈ ఘటనలో గర్భిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏఎస్ఐని కాల్చిచంపిన దుండగులు
సాక్షి, లక్నో : ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) సుధీర్ కుమార్ త్యాగిని యూపీలో కొందరు దుండగులు కాల్చిచంపారు. భజన్‌పుర పోలీస్ స్టేషన్లో నియమితులైన త్యాగి గురువారం విధులు ముగించుకుని బైక్‌పై భార్య, కుమర్తెతో కలిసి ఇంటికి తిరిగివస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దాడి జరిగిన సమయంలో ఏఎస్ఐ హపూర్ జిల్లాలోని తన స్వగ్రామం నగోలాకు వెళుతున్నారు. దుండగులు జరిపిన కాల్పుల్లో త్యాగి ఘటనాస్థలంలోనే మరణించారు. పట్టపగలు పోలీస్ అధికారిని కాల్చిచంపిన ఘటనతో స్ధానికులు విస్తుపోయారు. త్యాగిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మోదీనగర్ రోడ్డు కొత్వాలి నగర సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్ఐ హత్యతో జిల్లా ఎస్పీ సహా హపూర్ జిల్లా అధికారులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు. నిందితుల కోసం స్ధానిక పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు స్ధానిక పోలీసులు సమాచారం అందించారు. -
ప్రేమజంటపై దుండగుడి దాడి
-
ప్రేమజంటపై దుండగుడి దాడి
నూజివీడు : పట్టణంలోని సిలువగట్టు ప్రాంతంలో ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని పోలీసులు బుధవారం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని మాడుగులపల్లికి చెందిన గల్లిపోగు సాల్మాన్‌రాజు (23) గతంలో నూజివీడు డీఏఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈనెల 7న పరీక్ష ఉంది. 5 తేదీనే నూజివీడు పట్టణంలోని అజరయ్యపేటలో ఉన్న తన మేనమామ కలపాల రామారావు ఇంటికి వచ్చాడు. ఇతనికి ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన ఇంటర్ విద్యార్థిని (18)తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 6న పరీక్ష రాసిన విద్యార్థిని ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 5.30 గంటల సమయంలో నూజివీడు బస్టాండ్ వద్దకు వచ్చింది. సాల్మాన్‌రాజు, విద్యార్థిని కలిసి సిలువగట్టు ప్రాంతానికి సాయంత్రం 6గంటల సమయంలో వెళ్లారు. గట్టుపైన ఉన్న మేరీమాత గుడి వద్ద కూర్చొని ఉండగా దుండగుడు కట్టెదుంగతో వచ్చి డబ్బులు ఇవ్వాలని జంటను కోరాడు. వారు తమ దగ్గర లేవని సమాధానం చెప్పడంతో చేతిలో ఉన్న దుంగతో దాడి చేశాడు. విద్యార్థిని తన వద్ద ఉన్న రూ.3వేలు దుండగుడికి ఇచ్చింది. అవి తీసుకుని దుండగుడు వెళ్లిపోయాడు. వీరిద్దరూ దెబ్బలకు స్పృహతప్పి పడిపోయారు. బుధవారం ఉదయం 10గంటల సమయంలో కొందరు సిలువగట్టుపైకి ఎక్కుతుండగా అపస్మారక స్థితిలో ఉన్న జంట కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, సీఐ మేదర రామ్‌కుమార్ సందర్శించారు. దాడిచేసిన దుండగుడు ఎర్రగా, పిల్లికళ్లు కలిగి ఉన్నాడని బాధితులు చెపుతున్నారు. పట్టణ ఎస్ఐ–2 పీ ఏసుపాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల్లో రెండో సంఘటన రెండు నెలల కాలంలో ఈ సంఘటన రెండోది కావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ముసునూరు మండలానికి చెందిన జంట విజయవాడ నుంచి వస్తూ సిలువగట్టు వద్దకు వెళ్లగా దుండగుడు కర్రదుంగతో వ్యక్తి తలపై బలంగా కొట్టడంతో పడిపోయాడు. అతని వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్ బ్యాగ్, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. మళ్లీ ఇదే తరహాలో సంఘటన ఇప్పుడు చోటుచేసుకోవడం గమనార్హం. -
హయత్‌నగర్‌లో దుండగుల దాడి.. భార్య మృతి, భర్త సీరియస్
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. సంఘీ టెంపుల్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తున్న దంపతులపై దుండగులు హత్యాయత్నం చేశారు. కత్తులతో వారిపై దాడి చేయడంతో ఇద్దరిలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. కోహెడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో శివారు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి బాగా క్షీణిస్తోంది. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన సమావేశానికి హాజరైన కొందరు తిరిగి వెళ్తుండగా బస్సు మీద రాళ్లతో దాడి కూడా హయత్‌నగర్ ప్రాంతంలోనే జరిగిన విషయం తెలిసిందే.