ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి | Unidentified Miscreants Open Fire In Delhi JJ Colony Two Died | Sakshi
Sakshi News home page

దేశ రాజధానిలో పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి

Published Tue, Aug 23 2022 9:24 AM | Last Updated on Tue, Aug 23 2022 9:29 AM

Unidentified Miscreants Open Fire In Delhi JJ Colony Two Died - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. జేజే కాలనీలో సోమవారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ముఖాలకు మాస్క్‌లు వేసుకోవటం ద్వారా దుండగులను గుర్తించలేకపోయినట్లు స్థానికులు తెలిపారు. 

కాల్పుల  ఘటనపై వివరాలు వెల్లడించారు బాధితుడి సోదరుడు. ‘ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మా సోదరుడు, ఆయనతో కూర్చున్న ఇద్దరు వృద్ధులపై కాల్పులకు పాల్పడినట్లు మా పొరుగింటివారు చెప్పారు.’ అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: నాన్‌వెజ్‌ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement