హైదరాబాద్ శివారు ప్రాంతంలోని హయత్నగర్లో దారుణం జరిగింది. సంఘీ టెంపుల్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తున్న దంపతులపై దుండగులు హత్యాయత్నం చేశారు. కత్తులతో వారిపై దాడి చేయడంతో ఇద్దరిలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
కోహెడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో శివారు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి బాగా క్షీణిస్తోంది. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన సమావేశానికి హాజరైన కొందరు తిరిగి వెళ్తుండగా బస్సు మీద రాళ్లతో దాడి కూడా హయత్నగర్ ప్రాంతంలోనే జరిగిన విషయం తెలిసిందే.
హయత్నగర్లో దుండగుల దాడి.. భార్య మృతి, భర్త సీరియస్
Published Sat, Sep 14 2013 9:08 PM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement