ఆ రైళ్లలో ఎల్‌సీడీ స్ర్కీన్‌లకు టాటా! | Railway Wants To Remove LCD Screens From Trains | Sakshi
Sakshi News home page

ఆ రైళ్లలో ఎల్‌సీడీ స్ర్కీన్‌లకు టాటా!

Published Sat, Mar 17 2018 12:33 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Tejas Train - Sakshi

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ (ఫైల్‌)

రైల్వే ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి తేజస్‌, శతాబ్ది రైళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ స్ర్కీన్‌లతో రైల్వేశాఖకు కొత్త సమస్య వచ్చిపడింది. ఈ రైళ్లలో ప్రతి ప్రయాణికుడి సీటు ముందు ఏర్పాటు చేసిన  ఎల్‌సీడీ స్ర్కీన్‌లను ప్రయాణీకులు ధ‍్వంసం చేయడం, కొంతమంది వాటి హెడ్‌సెట్‌లను తీసుకెళ్తున్నారనీ, ఇంకొంతమందైతే ఆ ఎల్‌సీడీ స్క్రీన్‌లనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనీ రైల్వే వ్యవస్థ వాపోతోంది. పగిలిన స్ర్కీన్‌లను మళ్లీ అమర్చాలన్నా, కొత్తవాటిని తీసుకురావాలన్నా వాటికి ఖర్చు ఎక్కువ అవుతోందని అసలు ఎల్‌సీడీ స్ర్కీన్‌లనే రైల్లోంచి తీసేయాలని రైల్వే యంత్రాంగం ఆలోచిస్తుంది. బొంబాయి నుంచి గోవాకు వెళ్లే ఈ రైళ్లను నడపాలంటే రైల్వేవ్యవస్థ వ్యయప్రయాసలకు గురవుతోందట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement