LCD projector
-
ఆ రైళ్లలో ఎల్సీడీ స్ర్కీన్లకు టాటా!
రైల్వే ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి తేజస్, శతాబ్ది రైళ్లలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లతో రైల్వేశాఖకు కొత్త సమస్య వచ్చిపడింది. ఈ రైళ్లలో ప్రతి ప్రయాణికుడి సీటు ముందు ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లను ప్రయాణీకులు ధ్వంసం చేయడం, కొంతమంది వాటి హెడ్సెట్లను తీసుకెళ్తున్నారనీ, ఇంకొంతమందైతే ఆ ఎల్సీడీ స్క్రీన్లనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనీ రైల్వే వ్యవస్థ వాపోతోంది. పగిలిన స్ర్కీన్లను మళ్లీ అమర్చాలన్నా, కొత్తవాటిని తీసుకురావాలన్నా వాటికి ఖర్చు ఎక్కువ అవుతోందని అసలు ఎల్సీడీ స్ర్కీన్‌లనే రైల్లోంచి తీసేయాలని రైల్వే యంత్రాంగం ఆలోచిస్తుంది. బొంబాయి నుంచి గోవాకు వెళ్లే ఈ రైళ్లను నడపాలంటే రైల్వేవ్యవస్థ వ్యయప్రయాసలకు గురవుతోందట. -
వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బుధవారం ఎస్పీ శివకుమార్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని గమనిస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. త న కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ సత్ఫలితాలు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. అంతా ప్రశాంతం మానకొండూర్ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ శివకుమార్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొమ్మిదివేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రేహౌండ్స్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట కరీంనగర్ రూరల్ సీఐ కమలాకర్డ్డి ఉన్నారు.