బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లపై తీవ్రమైన అశాంతి నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ బ్యాంక్, పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లు హ్యాక్‌నకు గురయ్యాయి. ‘ది ఆర్3 సిస్టన్స్3’ అనే గ్రూప్ ఈ వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్లు ప్రకటించుకుంది. ‘ఆపరేషన్ హంట్‌డౌన్, స్టాప్ కిల్లింగ్ స్టూడెంట్స్’ అనే సందేశం హ్యాక్ అయిన ఈ మూడు సైట్‌లలో కనిపించింది.
‘వీరత్వం కలిగిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం, దాని రాజకీయ మిత్రపక్షాలు చేసిన క్రూరమైన దాడులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఇది కేవలం నిరసన కాదు, న్యాయం, స్వేచ్ఛ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం’ అని హ్యాకర్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో, రిజర్వేషన్లలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ హింసాయుత దాడుల్లో 100 మందికి పైగా జనం మృతి చెందారు. మూడు వేల మందికి పైగా జనం గాయపడ్డారు.
ఈ హింసాకాండ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. రైల్వేలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడానికి ప్రధాని షేక్ హసీనా దేశంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. నిరసనకారులు ఎవరైనా కనిపిస్తే కాల్చివేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment