సబ్జెక్టుల్లో ప్రపంచంలోనే బెస్ట్ వర్సిటీలు ఇవే..
న్యూయార్క్: ప్రతి ఏడాది ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయాలను గుర్తించి వాటి జాబితాను విడుదల చేసినట్లుగానే ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకిగ్స్ సంస్థ విడుదల చేసింది.
బోధన, అకాడమిక్ పనితీరు, వర్సిటీలో మౌలిక సదుపాయాలతోపాటు పరిశోధనలు, ఉద్యోగుల పనితీరు విద్యార్థుల పురోగతి వంటి అంశాల అధారంగా మొత్తం 16 ఉత్తమ వర్సిటీల జాబితాను ప్రకటించింది. అయితే, పైన తెలిపిన అంశాలను ప్రాథమికంగా సర్వే కోసం తీసుకున్నా.. కేవలం సబ్జెక్టుల ఆధారంగా మాత్రం అత్యుత్తమ సేవలు అందిస్తున్న బెస్ట్ యూనివర్సిటీల జాబితా ప్రకటించింది.
అవి ఏంటంటే..
1.హార్వార్డ్ యూనివర్సిటీ అమెరికా
2.మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా
3.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, బ్రిటన్
4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, బ్రిటన్
5.వెజినింజెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్
6.ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, బ్రిటన్
7.యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియా, అమెరికా
8.యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, హాంకాంగ్ చైనా
9.ఈటీహెచ్ జూరిచ్, స్విట్జర్లాండ్
10.యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రిటన్
11.కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్, అమెరికా
12.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బార్కెలీ క్యాంపస్, అమెరికా
13.యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా, అమెరికా
14.ది జులియార్డ్ స్కూల్, అమెరికా
15.యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ అమెరికా
16.యూనివర్సిటీ ఆఫ్కాలిఫోర్నియా, డేవిస్ క్యాంపస్, అమెరికా