QS World University Rankings
-
వ్యాక్సిన్ సర్టిఫికెట్లో తప్పులుంటే మార్చొచ్చు
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకున్నారా? అందులో ఏమైనా తప్పులు దొర్లాయా? కంగారు అక్కర్లేదు. కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో తప్పుల్ని సవరించుకోవచ్చు. రైజ్ ఏన్ ఇష్యూ అనే కొత్త ఫీచర్ సాయంతో సరి్టఫికెట్లో తప్పుల్ని దిద్దుకోవచ్చునని ఆరోగ్య శాఖ తెలిపింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ లాంటి అంశాల్లో ఏమైనా తప్పులుంటే మార్చుకోవచ్చు. అయితే ఒక్కసారి మాత్రమే ఈ ఆప్షన్ని వినియోగించుకోగలరని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ చెప్పారు. చాలా సులభమైన స్టెప్స్ సాయంతో ఈ పని మీరే చేసుకోవచ్చు ► www.cowin.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి ► సైన్ ఇన్ అవడానికి 10 అంకెలున్న మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి ► ఆ తర్వాత అకౌంట్ డిటైల్స్‌లోకి వెళ్లాలి ► ఒక డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న వారికి ‘‘రైజ్ ఏన్ ఇష్యూ’’ అనే బటన్ కనిపిస్తుంది ► ఆ బటన్ నొక్కితే కరెక్షన్ ఇన్ సరి్టఫికెట్ అంటూ ఆప్షన్లు కనిపిస్తాయి. మీ సరి్టఫికెట్లో ఎక్కడ తప్పులున్నాయో వాటిని ఎడిట్ చేసుకోవాలి. ► తర్వాత తప్పుల్లేని సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొని దాచుకోవాలి చదవండి: పిల్లలకు రెమ్‌డెసివిర్ వద్దు -
ఐఐటీ హైదరాబాద్‌కు 591 ర్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐటీ–హైదరాబాద్ 591వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్–200 స్థానాల్లో మన దేశానికి చెందిన మూడు జాతీయస్థాయి విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–బాంబే 177వ ర్యాంకు, ఐఐటీ–ఢిల్లీ 185వ ర్యాంకు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 186వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఐఐఎస్సీ బెంగళూరు పరిశోధన అంశంలో ప్రపంచంలో నంబర్1 స్థానాన్ని సాధించింది. ఈమేరకు ప్రధాని మోదీæ బెంగళూర్ ఐఐఎస్సీతో పాటు ఐఐటీ–బాంబే, ఐఐటీ–ఢిల్లీ సంస్థలను అభినందించారు. ఇక ఐఐటీ – మద్రాస్ 255వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 277వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 280వ ర్యాంకు, ఐఐటీ–గువాహతి 395వ ర్యాంకు, ఐఐటీ రూర్కీ 400వ ర్యాంకు సాధించాయి. ఢిల్లీ యూనివర్శిటీ 501–510 మధ్య, జేఎన్‌యూ–ఢిల్లీ 561–570 మధ్య, ఐఐటీ–హైదరాబాద్ 591–600 మధ్య, సావిత్రీబాయ్ ఫూలే పుణె వర్సిటీ 591–600 మధ్య నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 651–700 మధ్య నిలిచింది. ఐఐటీ–భువనేశ్వర్, ఓపీ జిందాల్ గ్లోబ్ యూనివర్సిటీ 701–750 మధ్య, పాండిచ్చేరి యూనివర్సిటీ 801–1000 మధ్య, బిట్స్ పిలానీ, ఉస్మానియా యూనివర్సిటీ, వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూర్ సంస్థలు 1001–1200 మధ్య స్థానాల్లో నిలిచాయి. ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1200 పైన నిలిచింది. జాతీయస్థాయిలో చూస్తే ఐఐటీ–హైదరాబాద్‌కు 11వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 14వ స్థానం, ఉస్మానియా వర్సిటీకి 30వ స్థానం దక్కాయి. -
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లండన్
లండన్: ప్రపంచంలోని ప్రముఖ నగరాలను వెనక్కినెట్టి వరుసగా రెండోసారి విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ సిటీ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ నగరాలైన టోక్యో, మెల్‌బోర్న్‌లు వరుసగా రెండు, మూడు ర్యాంకులను సాధించాయి. విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితాను బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) బుధవారం విడుదల చేసింది. ప్రతీ నగరానికి సంబంధించి ప్రధానంగా ఆరు అంశాలను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, జనాభా, జీవన ప్రమాణాలు, డిగ్రీ అనంతరం ఉద్యోగ అవకాశాలు, కొనుగోలు సామర్థ్యాలు, విద్యార్థుల అభిప్రాయాలు వంటి అంశాలు ఆయా నగరాల్లో ఏ మేరకు ఉన్నాయో విశ్లేషించి జాబితా రూపొందించింది. మొత్తం ప్రపంచంలోని 120 నగరాలకు సంబంధించి ఈ ర్యాంకులను విడుదల చేయగా.. భారత్ నుంచి బెంగళూరు 81వ ర్యాంకు, తర్వాత ముంబై–85, ఢిల్లీ–113, చెన్నై–115వ స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న భారతీయ విద్యార్థులు.. భారతదేశం నుంచి లండన్‌కు విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017–18లో ఈ సంఖ్య 20 శాతం పెరిగింది. 2017–18లో మొత్తం 5,455 మంది విద్యార్థులు లండన్‌లో విద్యాసంస్థల్లో చేరగా.. 2016–17లో ఆ సంఖ్య 4,545గా ఉంది. అయితే విద్యార్థుల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తుంది. దానికి కారణం వీసా జారీ ప్రక్రియ నిబంధనలు కొంతమేర కు కఠినతరంగా ఉండటంతో భారతీయ విద్యార్థులు లండన్ వైపు మొగ్గు చూపట్లేదని నివేదిక పేర్కొంది. అందుకే అగ్రస్థానం లండన్‌లోని విద్యార్థుల హర్షం విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్ ఎంపిక కావడం పట్ల అక్కడి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఉత్తమ నగరంగా లండన్ ఎంపిక సరైనదేనంటున్నారు. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అద్భుతమైన ఉపాధి అవకాశాలు, వైవిధ్యభరితమైన విద్యార్థి సంఘాలు వంటివి లండన్‌ను అగ్ర స్థానంలో నిలబెట్టాయని వివరిస్తున్నారు. యూరప్ ఆధిపత్యం టాప్–120 సిటీల్లో యూరప్ నగరాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. జర్మనీలోని మ్యూనిచ్ 4, బెర్లిన్ 5వ స్థానాల్లో నిలిచాయి. పారిస్ 7వ స్థానం, జ్యూరిచ్(స్విట్జర్లాండ్) 8వ స్థానం దక్కించుకున్నాయి. మాంట్రియల్ (కెనడా) 6వ స్థానం, సిడ్నీ(ఆస్ట్రేలియా) 9వ స్థానం, సియోల్(దక్షిణ కొరియా) 10వ స్థానంలో ఉన్నాయి. ఇక టాప్–30లో మరో రెండు బ్రిటిష్ నగరాలైన ఎడిన్బర్గ్ 15వ ర్యాంకు, మాంచెస్టర్ 29వ ర్యాంకు పొందాయి. -
క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే, ఢిల్లీ
న్యూఢిల్లీ: క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ బుధవారం విడుదలవ్వగా ఐఐటీ–బాంబే(152), ఐఐటీ–ఢిల్లీ(182), ఐఐఎస్సీ–బెంగళూరు(184)లకు టాప్– 200లో స్థానం లభించింది. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఖరగ్‌పూర్, ఐఐటీ–కాన్పూర్, ఐఐటీ–రూర్కీలకు టాప్–400లో చోటు దక్కింది. క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020ని లండన్‌లో విడుదల చేశారు. భారత్ నుంచి ఓపీ జిందాల్ టాప్–1,000లో చోటు సంపాదించిన అత్యంత కొత్త యూనివర్సిటీగా నిలిచింది. జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ తదితరాలకు కూడా ర్యాంకులు దక్కాయి. -
అత్యుత్తమ విశ్వవిద్యాయాలకు కేరాఫ్..
లండన్ : బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను గత మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎమ్ఐటీ) వరుసగా ఏడోసారి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విద్యార్థి- ఉపాధ్యాయుల నిష్పత్తి, అంతర్జాతీయంగా యూనివర్సిటీకి ఉన్న పేరు ప్రతిష్టలు, విద్యా ప్రమాణాలు, ఉద్యోగ కల్పన వంటి విభాగాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు క్యూఎస్ పేర్కొంది. ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలను నిర్ణయించేందుకు పరిగణనలోకి తీసుకున్న ప్రతీ విభాగంలో ఎమ్ఐటీ వందకు వంద పాయింట్లు సంపాదించినట్లు క్యూఎస్ వెల్లడించింది. కాగా ప్రపంచంలోని 39 యూనివర్సిటీలు వందకు 80 పాయింట్లు సాధించి టాప్ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ పేర్కొంది. కాగా ఈ జాబితాలో అత్యధికంగా 15 యూనివర్సిటీలతో అమెరికా ముందు వరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యూకే, చైనాకు చెందిన పలు యూనివర్సిటీలు ఉన్నాయి. క్యూఎస్ వెల్లడించిన ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితా (పాయింట్లతో సహా) -
టాప్ వర్సిటీల జాబితాలో ఐఐటీలు
న్యూఢిల్లీ : ప్రపంచ యూనివర్సిటీ ర్యాంక్‌ల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐఎస్ బెంగళూర్, ఐఐటీ ఢిల్లీలు టాప్ 200లో చోటుదక్కించుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే టాప్ 1000 వర్సిటీల జాబితాలో భారత యూనివర్సిటీల సంఖ్య 20 నుంచి 24కు పెరగడం గమనార్హం. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2019లో గత ఏడాదితో పోలిస్తే తాజా జాబితాలో ఐఐటీ బాంబే 17 స్ధానాలు మెరుగుపరుచుకుని 162వ ర్యాంక్‌లో నిలవడం ద్వారా దేశంలోనే టాప్ ఇనిస్టిట్యూట్‌గా పేరొందింది. ఐఐటీ ఢిల్లీ 172వ స్ధానంలో నిలిచింది. ఐఐసీ బెంగళూర్ సైతం ఐఐటీ ఢిల్లీని తోసిపుచ్చి 170వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంకింగ్ జాబితాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. 15వ సారి ప్రకటించిన ఈ ర్యాంకింగస్లో వరుసగా ఏడవ సంవత్సరం సైతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ యూనివర్సిటీగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలకు చెందిన ప్రముఖ 1000 విశ్వవిద్యాలయాల ర్యాంకులను ఈ జాబితా వెల్లడిస్తుంది. ఈ జాబితాలో భారత్ నుంచి 24 యూనివర్సిటీలు చోటు దక్కించుకోగా, ఏడు వర్సిటీలు తమ ర్యాంకును మెరుగుపరుచకున్నాయని, 9 సంస్థలు నిలకడగా ఉండగా, 5 వర్సిటీలు కొత్తగా చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ రీసెర్చి డైరెక్టర్ బెన్ సోటర్ పేర్కొన్నారు. -
విదేశీ విద్య : కేరాఫ్ అడ్రస్ 10 నగరాలు
లండన్ : బ్రెగ్జిట్ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ లండన్ ప్రపంచంలోనే విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన, ఉత్తమ విశ్వవిద్యాలయాలున్న నగరంగా కితాబు అందుకుంది. బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను గురువారం విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సరైన గమ్యస్థానం లండన్ అని క్యూఎస్ పేర్కొంది. ఈ జాబితా రూపొందించడానికి యూనివర్సిటీ ర్యాంకింగ్, విద్యార్థుల అభిప్రాయాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగుల పనితీరు, ఫీజు వివరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. భద్రతా ప్రమాణాలు, జనాభా, సాంఘిక అంశాలు, జనాదరణ వంటి అంశాల ఆధారంగా విద్యార్థులు యూనివర్సిటీలలో చేరుతున్నారని క్యూఎస్ తన నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో లండన్ తర్వాత టోక్యో, మెల్బోర్న్, మాంట్రియల్, పారిస్, మ్యూనిచ్, బెర్లిన్, జ్యూరిచ్, సిడ్నీ, సియోల్‌లు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పిస్తున్న నగరాల జాబితాలోనూ లండన్ రెండో స్థానం సంపాదించుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే లండన్‌లో అద్దె ఖర్చులు నిలకడగా ఉంటాయని.. ప్రపంచంలోని టాప్-10 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నందున ఈ జాబితాలో లండన్ ప్రథమ స్థానంలో నిలిచిందని క్యూఎస్ తెలిపింది. -
జేఎన్టీయూకేకు దక్కని చోటు
సాక్షి, బాలాజీచెరువు(కాకినాడసిటీ): సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం. విదేశీ వర్సిటీలతో కోర్సుల ఒప్పందాలు, మ్యూక్స్ ఆన్లైన్ కోర్సుల నిర్వహణతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నామంటూ పత్రికా ప్రకటనలు విడుదల చేసే వర్సిటీ అధికారులు ప్రపంచస్థాయి వర్సిటీ ర్యాంకుల్లో జేఎన్టీయూకేకు చోటు కల్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నాం.. వర్సిటీకి తగిన గుర్తింపు కోసం అన్ని విభాగాలు కలిసికట్టుగా పోరాడదామన్న ఆలోచన లేకుండాపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్సిటీలో ఏదైనా డైరెక్టర్ పోస్టు ఖాళీ అయితే ఆ పదవిని తమకున్న అధికార, ధన, కుల బలాలతో సర్వశక్తులూ ఒడ్డి దక్కించుకునే అధికారులు జేఎన్టీయూకే అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇటీవలే విడుదల చేసిన క్యూఎస్ ర్యాంకుల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న జేఎన్టీయూ కాకినాడకు స్థానం లేకపోవడం విస్మయానికి గురి చేసింది. విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ఆసియా బ్రిక్స్ ర్యాంకులు ఇచ్చే క్యూ ఎస్ సంస్థ విడుదల చేసిన 2018 ఫలితాల్లో జేఎన్టీయూ కాకినాడ ఎక్కడా కనిపించడకపోవడం గమనార్హం. ఏపీ ఎంసెట్, పీజీ సెట్, పోలీస్ రిక్రూట్మెంట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహిస్తున్న వరిర్సిటీకి గుర్తింపు రాలేదు. అకడమిక్, పరిశోధన, అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, వర్సిటీ ప్రతిష్ట తదితర అంశాలను ఆధారంగా అందజేసే ఈ ర్యాంకులలో జేఎన్టీయూ కాకినాడకు స్థానం లభించలేదు. ఏపీలో అనంతపురం, వైజాగ్ ఏయూ, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు 500 లోపు ర్యాంకులు సాధించగా జేఎన్టీయూ కాకినాడ దరిదాపుల్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచేలా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు తగ్గకుండా సాంకేతిక యూనివర్సిటీలు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నా దానికి తగ్గట్టుగా వర్సిటీ అధికారులు కృషి చేయడంలేదు. రాష్ట్ర విభజనకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ అంటూ మూడుగా విభజించాక జేఎన్టీయుహెచ్ తెలంగాణాలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్టీయూ అనంతపురం, కాకినాడ ఉన్నాయి. ప్రతిభ చూపిన నాలుగు వర్సిటీలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్రువీకరణ పత్రాలను ఆయా వర్సిటీల వీసీలకు అందజేస్తున్న నేపథ్యంలో ఆ అదృష్టం జేఎన్టీయూకేకు లేదు. ప్రస్తుత ఉపకులపతి అభివృద్ధి, పరిపాలనపై పెద్దగా దృష్టిసారించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించుకున్న ముఖ్యమంత్రి ఆ వర్సిటీకి గుర్తింపురాకపోవడంపై గల కారణాలు తెలుసుకుంటారని వర్సిటీ ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నారు. -
10బ్రిక్స్–20లో భారతీయ విద్యాసంస్థలు
న్యూఢిల్లీ: బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో అత్యున్నత విద్య అందించే టాప్–20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు సంపాదించాయి. ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్స్(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు(10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం టాప్–10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన వర్సిటీలే 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బుధవారమిక్కడ ర్యాంకుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ వీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. సంస్థ పేరు ప్రఖ్యాతులు, అధ్యాపకులు విద్యార్థుల నిష్పత్తి, ప్రచురితమైన పరిశోధనా పత్రాలు, అందుకున్న బహుమతులు, అంతర్జాతీయ అధ్యాపకులు, విద్యార్థుల శాతం సహా 8 అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. దేశంలోని టాప్–10 ప్రైవేటు విద్యాసంస్థల్లో బిట్స్ పిలానీ, థాపర్ విశ్వవిద్యాలయం, సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, మణిపాల్ వర్సిటీ, అమృతా విశ్వవిద్యాలయం, విట్ వర్సిటీ, కళింగ యూనివర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీలు చోటు దక్కించుకున్నాయని వెల్లడించారు. -
కంప్యూటర్ చదువుకు బెస్ట్ వర్సిటీ ఏదో తెలుసా?
యాపిల్, గూగుల్, ఫేస్ బుక్ లాంటి టెక్ దిగ్గజాల్లో కొలువు సాధించాలని కలలు కంటున్నారా? అయితే, అందుకు ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మరీ ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకోవాలి? కంప్యూటర్ సైన్స్ కోర్సును అందించే ఉత్తమ యూనివర్సిటీలు ఏవి? ఏ యూనివర్సిటీలో చదివితే కోరుకున్న కంపెనీ నుంచి జాబ్ పిలుపు వస్తుంది? అన్నఅంశాలపై తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యయనం చేసి ప్రపంచంలోని 50 ఉత్తమ యూనివర్సిటీలతో జాబితా రూపొందించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఆధారంగా.. కంప్యూటర్ సైన్స్ కోర్సును చదవడంలో విద్యార్థులు ఏ వర్సిటీకి అధిక ప్రాధాన్యమిస్తున్నారు? కంపెనీలు ఏ వర్సిటీ నుంచి రిక్రూట్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అనే అంశాలను బేరిజు వేసి గుర్తించిన ఆ టాప్ యూనివర్సిటీల వివరాలివి.. 1. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇది. ఇక్కడే ప్రపంచంలోని ఉత్తమ కంప్యూటర్ సైన్స్ , ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు లభిస్తున్నట్టు తాజాగా తేలింది. గార్డియన్ పత్రిక ప్రచుంరిచిన ఓ సర్వే ప్రకారం మిట్ పూర్వ విద్యార్థులు ఇప్పటివరకు 25,800 కంపెనీలను స్థాపించారు. 30 లక్షలమందికి ఉపాధి కల్పించారు. సిలికాన్ వ్యాలీలోని ఉద్యోగుల్లో మూడోవంతు ఈ కంపెనీకి చెందినవారే. క్యూఎస్ ర్యాంకింగ్ సిస్టమ్ కోర్సుల విషయంలో ఈ వర్సిటీకి 93.8 స్కోర్ ఇచ్చింది. 2. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియాకు చెందిన స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి ఓ ఘనత ఉంది. ఇందులో చదివిన విద్యార్థులు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలైన గూగుల్, హెచ్ పీ, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటివాటిని స్థాపించారు. ఈ వర్సిటీకి 93.2 స్కోర్ లభించింది. 3. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ యూకేలో నెలకొన్న ఈ యూనివర్సిటీ అతి పురాతనమైనది. 1096లో ఏర్పాటైన ఈ వర్సిటీ ఇప్పటికీ ఉత్తమమైన టెక్నాలజీ విద్య అందిస్తుండటం విశేషం. డీప్ మైండ్ వంటి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ వర్సిటీతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ వర్సిటీకి 92.5 స్కోరు లభించింది. 4. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయంగా పేరుంది. అయినా ఈ వర్సిటీ కంప్యూటర్ సైన్స్ కోర్సు విషయంలో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఈ వర్సిటీ డ్రాపౌటే. ఈ వర్సిటీ 92.4 స్కోరు సాధించింది. 5. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్ బర్గ్ కు చెందిన ప్రైవేటు యూనివర్సిటీ ఇది. హర్వర్డ్, స్టాన్ ఫర్డ్ వర్సిటీల మాదిరిగా ప్రపంచస్థాయి పేరుప్రఖ్యాతలు లేకపోయినప్పటికీ కంప్యూటర్ సైన్స్ విద్యను అందించడంలో ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఘనత సొంతం చేసుకుంది. ఈ వర్సిటీకి 91.4 స్కోరు లభించింది. 6. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యూకేలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్ గా కేంబ్రిడ్జ్ నగరానికి పేరుంది. ఈ నగరం ఎదుగుదల వెనుక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కృషి చాలా ఉంది. అంతర్జాతీయ టాప్ వర్సిటీగా పేరొందిన ఈ విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ కోర్సు అందించడంలో 89.8 స్కోరు లభించింది. 7. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కెలీ సాన్ ఫ్రాన్సికోలో భారీ భవనాలతో బర్కెలీలోనే అత్యంత ప్రతిష్టాత్మక వర్సిటీగా దీనికి పేరుంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు అందించడంలో ఈ వర్సిటీ 89.4 స్కోరు సాధించింది. 8. ఈహెచ్‌టీ జురిచ్ (స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అత్యధిక స్కోరు సాధించిన తొలి అమెరికా, బ్రిటన్ యేతర వర్సిటీ ఇదే. ఈ వర్సిటీకి చెందిన 23మంది విద్యార్థులు, లేదా ప్రొఫెసర్లకు నోబెల్ అవార్డు లభించింది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు అందించడంలో ఈ వర్సిటీ 86.3 స్కోరు సాధించింది. 9. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) సింగపూర్ లో ప్రాచీనమైన ఉన్నత విద్యాకేంద్రం ఇది. దాదాపు 35వేలమంది విద్యార్థులకు ఈ వర్సిటీ విద్యనందిస్తోంది. ఈ వర్సిటీకి 85.9 స్కోరు లభించింది. 10. ప్రిన్స్టన్ యూనివర్సిటీ న్యూజెర్సీలో ఏర్పాటైన ఈ వర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా మంచిపేరుంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు అందించడంలో ఈ వర్సిటీ 85.6 స్కోరు సాధించింది. ఇంకా జాబితాలో చోటుసాధించిన టాప్ 50 యూనివర్సిటీలు- ర్యాంకుల వరుసక్రమంలో వాటి స్కోరు వివరాలివి.. 11. టొరంటో విశ్వవిద్యాలయం, కెనడా - స్కోరు 83.8 స్కోరు 12. ఇంపీరియల్ కాలేజ్ లండన్, - 83,8 స్కోరు 13. మెల్బోర్న్ యూనివర్సిటీ- స్కోరు 83.1 14. నాన్యంగ్ టెక్నోలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్ (NTU)- స్కోరు 82.9 15. ద హాంగ్ కాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- స్కోరు 82.9 16. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజెల్స్ (యూసీఎల్ఏ) - స్కోరు 82.8 17. సింఘ్వా యూనివర్సిటీ, బీజింగ్- స్కోరు 82.7. 18. ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరల్ దే లౌసన్నె (EPFL) - స్విస్ విశ్వవిద్యాలయం- స్కోరు 82.6 19 హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయం- స్కోరు 82.1 20 ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం - స్కోరు 81.9 . 21. టోక్యో విశ్వవిద్యాలయం- స్కోరు 81.8 22. హాంగ్ కాంగ్ చైనీస్ విశ్వవిద్యాలయం (సీయూహెచ్ కే)- స్కోరు 81.7 23. పెకింగ్ విశ్వవిద్యాలయం, బీజింగ్ - స్కోరు 81,0 24. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా- స్కోరు 80.6 25. జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - స్కోరు 80.5 26. కార్నెల్ విశ్వవిద్యాలయం - స్కోరు 80.4 27. వాటర్లూ యూనివర్సిటీ, కెనడా- స్కోరు 80.4 28. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)- స్కోరు 80.3 29. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం- స్కోరు 80.3 30. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం (అర్బనా-కాంపెయిన్)- స్కోరు 79.6 31. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, కాన్ బెరా- స్కోరు 79.5 32. కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్ - స్కోరు 79.5 33. యూసీఎల్ (యూనివర్సిటీ కాలేజ్ లండన్) - స్కోరు 79.3 34. టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్- స్కోరు 79,2 35. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా- స్కోరు 78.0 36. కొరియా అడ్వాన్స్ డ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- స్కోరు 77.9 36. మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సటీ, జర్మనీ - స్కోరు 77.9 38. యేల్ విశ్వవిద్యాలయం- స్కోరు 77.7 39. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం- స్కోరు 77.2 . 40. సియోల్ నేషనల్ యూనివర్శిటీ, దక్షిణ కొరియా- స్కోరు 76.9 41. సిడ్నీ విశ్వవిద్యాలయం - స్కోరు 76.9 42. న్యూయార్క్ విశ్వవిద్యాలయం - స్కోరు 76.8 43. పాలిటెక్నికో డి మిలానో, ఇటలీ- స్కోరు 76.3 44. షాంఘై జియో టోంగ్ విశ్వవిద్యాలయం- స్కొరు 76.2 45. కాలిఫోర్నియా యూనివర్శిటీ, శాన్ డియాగో - స్కోరు 76.2 46. నేషనల్ తైవాన్ యూనివర్శిటీ- స్కోరు 76.0 47. మిచిగాన్ యూనివర్సిటీ- స్కోరు 75.1 48. షికాగో విశ్వవిద్యాలయం- స్కోరు 74.8. 49. హాంగ్ కాంగ్ సిటీ యూనివర్సిటీ- స్కోరు 74.1 50. హాంగ్ కాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం - స్కోరు 74.1