లండన్ : బ్రెగ్జిట్ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ లండన్ ప్రపంచంలోనే విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన, ఉత్తమ విశ్వవిద్యాలయాలున్న నగరంగా కితాబు అందుకుంది. బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను గురువారం విడుదల చేసింది.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సరైన గమ్యస్థానం లండన్ అని క్యూఎస్ పేర్కొంది. ఈ జాబితా రూపొందించడానికి యూనివర్సిటీ ర్యాంకింగ్, విద్యార్థుల అభిప్రాయాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగుల పనితీరు, ఫీజు వివరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.
భద్రతా ప్రమాణాలు, జనాభా, సాంఘిక అంశాలు, జనాదరణ వంటి అంశాల ఆధారంగా విద్యార్థులు యూనివర్సిటీలలో చేరుతున్నారని క్యూఎస్ తన నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో లండన్ తర్వాత టోక్యో, మెల్‌బోర్న్, మాంట్రియల్, పారిస్, మ్యూనిచ్, బెర్లిన్, జ్యూరిచ్, సిడ్నీ, సియోల్‌లు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పిస్తున్న నగరాల జాబితాలోనూ లండన్ రెండో స్థానం సంపాదించుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే లండన్‌లో అద్దె ఖర్చులు నిలకడగా ఉంటాయని.. ప్రపంచంలోని టాప్-10 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నందున ఈ జాబితాలో లండన్ ప్రథమ స్థానంలో నిలిచిందని క్యూఎస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment