
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నారా? అందులో ఏమైనా తప్పులు దొర్లాయా? కంగారు అక్కర్లేదు. కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో తప్పుల్ని సవరించుకోవచ్చు. రైజ్ ఏన్ ఇష్యూ అనే కొత్త ఫీచర్ సాయంతో సరి్టఫికెట్‌లో తప్పుల్ని దిద్దుకోవచ్చునని ఆరోగ్య శాఖ తెలిపింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ లాంటి అంశాల్లో ఏమైనా తప్పులుంటే మార్చుకోవచ్చు. అయితే ఒక్కసారి మాత్రమే ఈ ఆప్షన్‌ని వినియోగించుకోగలరని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ చెప్పారు. చాలా సులభమైన స్టెప్స్ సాయంతో ఈ పని మీరే చేసుకోవచ్చు
► www.cowin.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
► సైన్ ఇన్ అవడానికి 10 అంకెలున్న మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి
► ఆ తర్వాత అకౌంట్ డిటైల్స్‌లోకి వెళ్లాలి
► ఒక డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న వారికి ‘‘రైజ్ ఏన్ ఇష్యూ’’ అనే బటన్ కనిపిస్తుంది
► ఆ బటన్ నొక్కితే కరెక్షన్ ఇన్ సరి్టఫికెట్ అంటూ ఆప్షన్లు కనిపిస్తాయి. మీ సరి్టఫికెట్‌లో ఎక్కడ తప్పులున్నాయో వాటిని ఎడిట్ చేసుకోవాలి.
► తర్వాత తప్పుల్లేని సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకొని దాచుకోవాలి
చదవండి: పిల్లలకు రెమ్‌డెసివిర్ వద్దు
Comments
Please login to add a commentAdd a comment