IISc Bangalore
-
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో బెంగళూరు ఐఐఎస్సీ
సాక్షి, ఎడ్యుకేషన్: అంతర్జాతీయంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులను ప్రకటించే ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ జాబితాలో మొట్టమొదటిసారి భారత్‌కు చెందిన ఓ విద్యా సంస్థ టాప్–100లో చోటు సాధించింది. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ – బెంగళూరు) 96వ ర్యాంకు సొంతం చేసుకొంది. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విభాగంలో సైతం 99వ ర్యాంకు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 11 వేల ఉన్నత విద్యా సంస్థల్లోని బోధన ప్రమాణాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా 2024 సంవత్సరానికి గత ఏడాది అక్టోబర్‌లో ర్యాంకులు కేటాయించగా.. తాజాగా 11 సబ్జెక్ట్ విభాగాల్లో సబ్జెక్ట్ వారీగా ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అగ్రస్థానం దక్కించుకుంది.ఐఐఎస్సీ బెంగళూరు జోరు..సబ్జెక్ట్ వారీ ర్యాంకుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు జోరు కనిపించింది. ఈ సంస్థ 250 లోపు ర్యాంకు శ్రేణిలో నాలుగు సబ్జెక్ట్ విభాగాల్లో ర్యాంకులు సాధించింది. కంప్యూటర్ సైన్స్‌లో 96వ ర్యాంకు, ఇంజనీరింగ్‌లో 99వ ర్యాంకు, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్‌లోనూ 201–250 ర్యాంకుల శ్రేణిలో నిలిచింది. మెడికల్ అండ్ హెల్త్ సబ్జెక్ట్‌లో సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్స్ 201–300 శ్రేణిలో ర్యాంకు పొందింది.సైకాలజీలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 401–500 ర్యాంకుల్లో నిలిచింది. న్యాయ శాస్త్రంలో ఢిల్లీ యూనివర్సిటీ 301 ర్యాంకుల్లో బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో అమిటీ యూనివర్సిటీ 401 – 500 శ్రేణిలో, ఎడ్యుకేషన్ స్టడీస్‌లో ఢిల్లీ యూనివర్సిటీ 501–600 శ్రేణిలో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్‌లో ఢిల్లీ యూనివర్సిటీ 401–500 శ్రేణిలో, సోషల్ సైన్సెస్‌లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 251–300 శ్రేణిలో నిలిచాయి.ఐఐటీలు.. 501పైగా ర్యాంకులతో..మరోవైపు.. ఇంజనీరింగ్ విద్యకు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు మాత్రం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విభాగంలో 501కి పైగా శ్రేణిలో నిలవడం గమనార్హం. ఐఐటీ గువహటి, ఇండోర్లు 501–600 శ్రేణిలో ఉన్నాయి. ఐఐటీ–పాట్నా 601–800; ఐఐటీ గాంధీనగర్, మండి, రోపార్లు 801–1000 ర్యాంకుల శ్రేణిలో నిలిచాయి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాత్రం ఐఐటీ–ఇండోర్ 401–500 జాబితాలో చోటు సాధించింది. ఐఐటీ–పాట్నా 501–600, ఐఐటీ–గాంధీనగర్ 601 – 800, ఐఐటీ – గువహటి 801–1000 జాబితాలో నిలిచాయి. తొలి తరం ఐఐటీలుగా పిలిచే ఖరగ్‌పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై, రూర్కీ, చెన్నైకి చోటే దక్కలేదు.సబ్జెక్ట్ వారీగా టాప్–1 ఇన్స్టిట్యూట్స్» కంప్యూటర్ సైన్స్ – యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్» ఫిజికల్ సైన్సెస్ – కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ» లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడికల్ అండ్ హెల్త్ సబ్జెక్ట్‌లలో – హార్వర్డ్ యూనివర్సిటీ» సైకాలజీ, న్యాయ శాస్త్రం – స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ» బిజినెస్ ఎకనామిక్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ – మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ» ఎడ్యుకేషన్ స్టడీస్ – యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాప్రామాణికంగా అయిదు అంశాలుఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు కేటాయించడంలో టీచింగ్, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ క్వాలిటీ, ఇండస్ట్రీ ఔట్లుక్, ఇంటర్నేషనల్ ఔట్లుక్ అనే అయిదు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అంశాల్లో ఆయా విద్యా సంస్థల్లో నాణ్యత, నైపుణ్యం ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయిస్తారు. ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ రీసెర్చ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ తదితర అంశాలను కూడా పరిశీలిస్తారు.ప్రామాణిక అంశాలపై భిన్నాభిప్రాయాలుర్యాంకుల నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకునే అంశాల విషయంలో ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వంటి ప్రామాణికాలు భారతీయ విద్యా సంస్థల పరిస్థితికి సరితూగేలా లేవని విద్యావేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికా, ఇంగ్లండ్లనే ఎంచుకుంటున్నారని, దీంతో ఈ విద్యార్థుల సంఖ్య భారతీయ విద్యా సంస్థల్లో తక్కువ ఉంటోందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ర్యాంకుల్లో ఇన్స్టిట్యూట్స్ వెనుకంజలో ఉంటున్నాయని చెబుతున్నారు. -
Employability Rankings: ప్రపంచంలో ఎక్కువ ఉద్యోగార్హత ఈ యూనివర్సిటీవాళ్లదే!
Times Higher Education (THE) Graduate Employability Rankings 2021: ఉద్యోగవకాశాలు కల్పించడంలో సాంకేతిక విద్యాలయాల పాత్ర ఎంతో ప్రముఖమైంది. అయితే ఈ ఏడాది మన దేశంలోని ప్రముఖ విద్యాలయాలు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటాయి. ఏకంగా 27వ స్థానంతో టైమ్స్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో నిలిచింది ఐఐటీ ఢిల్లీ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ 2021లో ఢిల్లీ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ 32వ ర్యాంక్), యూనివర్సిటీ ఆఫ్ చికాగో(33వ ర్యాంక్)లను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎక్కువమందిని ఢిల్లీ ఐఐటీ అందిస్తోందన్నమాట. ఇక ఈ లిస్ట్‌లో టాప్-100లో బెంళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc(61), ఐఐటీ బాంబే(97) కూడా చోటు దక్కించుకున్నాయి. గతంలో వీటి ర్యాంక్స్ 71, 128గా ఉండగా.. ఈ ఏడాది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్(162), ఐఐటీ ఖరగ్పైర్ (170), అమిటీ యూనివర్సిటీ(225), బెంగళూరు యూనివర్సిటీ(249) స్థానాల్లో నిలిచాయి. ఇక క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్ టాప్ 150లో ఢిల్లీ, బాంబే ఐఐటీలు స్థానం దక్కించుకున్నాయి. ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌ను ఉద్యోగుల సబ్జెక్ట్ స్పెషలైజేషన్, గ్రాడ్యుయేట్ స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఎక్సలెన్స్, డిజిటల్ పర్ఫార్మెన్స్, ఫోకస్ ఆన్ వర్క్, సాఫ్ట్ స్కిల్స్-డిజిటల్ లిటరసీ, ఇంటర్నేషనలిజం, స్పెషలైజేషన్.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. THE Graduate Employability Rankings 2021 లో మాసెచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(అమెరికా) టాప్ ప్లేస్‌లో ఉంది. ఆసియా నుంచి టోక్యో యూనివర్సిటీ(6), సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ (9) మాత్రమే టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్నాయి. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! సంచలన విషయాలు వెల్లడి..! -
వ్యాక్సిన్ సర్టిఫికెట్లో తప్పులుంటే మార్చొచ్చు
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకున్నారా? అందులో ఏమైనా తప్పులు దొర్లాయా? కంగారు అక్కర్లేదు. కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో తప్పుల్ని సవరించుకోవచ్చు. రైజ్ ఏన్ ఇష్యూ అనే కొత్త ఫీచర్ సాయంతో సరి్టఫికెట్లో తప్పుల్ని దిద్దుకోవచ్చునని ఆరోగ్య శాఖ తెలిపింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ లాంటి అంశాల్లో ఏమైనా తప్పులుంటే మార్చుకోవచ్చు. అయితే ఒక్కసారి మాత్రమే ఈ ఆప్షన్ని వినియోగించుకోగలరని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ చెప్పారు. చాలా సులభమైన స్టెప్స్ సాయంతో ఈ పని మీరే చేసుకోవచ్చు ► www.cowin.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి ► సైన్ ఇన్ అవడానికి 10 అంకెలున్న మీ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి ► ఆ తర్వాత అకౌంట్ డిటైల్స్‌లోకి వెళ్లాలి ► ఒక డోసు, లేదంటే రెండు డోసులు తీసుకున్న వారికి ‘‘రైజ్ ఏన్ ఇష్యూ’’ అనే బటన్ కనిపిస్తుంది ► ఆ బటన్ నొక్కితే కరెక్షన్ ఇన్ సరి్టఫికెట్ అంటూ ఆప్షన్లు కనిపిస్తాయి. మీ సరి్టఫికెట్లో ఎక్కడ తప్పులున్నాయో వాటిని ఎడిట్ చేసుకోవాలి. ► తర్వాత తప్పుల్లేని సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొని దాచుకోవాలి చదవండి: పిల్లలకు రెమ్‌డెసివిర్ వద్దు -
చంద్రునిపై ఇల్లు: మూత్రంతో ఇటుకలు!
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నప్పుడు మనం చంద్రున్ని చూస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అంటూ గోరు ముద్దలు తింటుంటాం. అయితే రాబోయే రోజుల్లో నిజంగానే చంద్రునిపై జీవించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రునిపై నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఉండే ఇటుకలను ఇస్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఇటుకల తయారీలో చంద్రుని మీద నుంచి తెచ్చిన మట్టి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, చిక్కుడు కాయల గుజ్జు ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీవక్రియలో భాగంగా ఇటుకకు ఎక్కువ మన్నిక లభించేలా చేసే కొన్ని పదార్ధాలను విడుదల చేస్తాయి. ఇవి యూరియాతో చర్యలు జరిపి కాల్షియం కార్భైడ్ లాంటి పదార్ధాల తయారిలో ఉపయోగపడతాయి. అందుకే ఈ ఇటుకల తయారీలో మూత్రం ద్వారా తయారయ్యే యూరియాను కూడా ఉపయోగిస్తారు. (కరోనా వాక్సిన్ : ప్రధాని మోదీ గుడ్ న్యూస్) అంతరిక్ష పరిశోధనలు గత శతాబ్ధ కాలంలో విపరీతంగా పెరిగాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. వీటిలో ఒక పౌండ్ ఇటుకలను స్పేస్‌కు చేర్చడానికి రూ. 7.5 లక్షల ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఖర్చు కాల క్రమేణా తగ్గుతుందని తెలిపారు. సాధారణంగా ఇటుకలను ఒకదానికి ఒకటి జత చేయడానికి సిమెంట్‌ను ఉపయోగిస్తారు. కానీ ఈ ఇటుకలను కలపడానికి చిక్కుడు కాయల గుజ్జును ఉపయోగిస్తున్నారు. ఇది ఇటుకలను మరింత గట్టిగా పట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి నిర్మాణంలో కెమికల్, మెకానికల్ ఇంజనీరింగ్ రెండు కలగలిపి ఉన్నాయని ఐఐఎస్సీ, బెంగుళూరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అలోక్ తెలిపారు. ఇస్రోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. దీంతో త్వరలోనే చంద్రునిపై చేపట్టనున్న నిర్మాణాలలో ఇండియా ప్రముఖ పాత్ర వహించనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. చదవండి: చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలి: మోదీ -
జంతువుల నుంచే 75 శాతం ఇన్ఫెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ శతాబ్దంలో వచ్చిన సార్స్, మెర్స్, ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు జంతువుల నుంచే వ్యాప్తి చెందినట్లు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులు నిర్ధారించారు. పలురకాల జూనోటిక్ వ్యాధులు జంతువులు లేదా సూక్ష్మక్రిముల నుంచి మనుషులకు రోగాలను వ్యాపింపజేస్తాయని గుర్తించారు. ఈ రోగాల్లో కొన్నిజంతువులను అనారోగ్యానికి గురిచేయకపోయినా, వీటి వల్ల మనుషులు మాత్రం అనారోగ్యానికి గురవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం 1,200 ఇన్ఫెక్షన్లు సోకేందుకు కారణమైన వ్యాధులు, రోగాల్లో 816 జూనోటిక్ డిసీజెస్ జంతువుల నుంచి (75 శాతం వరకు) వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఇంకొంత కాలం ఇంటినుంచే) స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యం దాకా.. ఈ వ్యాధులు స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యానికి కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు అనుసరించాల్సిన వ్యూ హంపై ‘నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇన్ వన్ హెల్త్’పేరిట ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ జి.పద్మనాభన్ నేతృత్వంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. జంతువుల, సూక్ష్మక్రిముల నుంచి సోకే వైరస్లు, వాటి విస్తృతి, వ్యాప్తికి సంబంధించిన వివిధ అంశాలను మెరుగైన పద్ధ తుల్లో అర్థం చేసుకునేందుకు ఇది కృషి చేయనుంది. మూడేళ్ల కాలపరిమితిలో ఈ రోగాలు, వ్యాధులకు సంబంధించి ప్రాధాన్యాంశాలను గుర్తించడం తో పాటు, ఈ వైరస్లు మళ్లీ రాకుండా, ఇన్ఫెక్షన్లు మళ్లీ సోకకుండా, బయో సేఫ్టీ, బయో సెక్యురిటీకి సంబంధించిన సవాళ్లను పరిశీలించి వెంటనే చేపట్టాల్సిన చర్యలను సూచించనుంది. వాతావరణ మార్పులు, అడవులు తగ్గిపోవడం, జంతువులతో వ్యవహరించే తీరు, వలసలు, టూరిజం, పట్టణీకరణ, మనుషుల ప్రవర్తనలో మార్పులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, జనాభా పెరుగుదల, సాంస్కృతిక పరమైన అంశాలు, తదితరాలు జూనోటిక్ వ్యాధులు రావడానికి కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏయే రకాలు.. వైరస్, బ్యాక్లీరియా, శిలీంద్రాలు తదితర పరాన్న జీవులు.. వీటిలో కొన్ని దోమలు, పేలు వంటివి వ్యాప్తి చేస్తాయి. వ్యాప్తి ఎలా.. ⇒ గాలి ద్వారా, కలుషితమైన మాంసం తినడం ⇒ వ్యాధి సోకిన జంతువులకు సన్నిహితంగా మెలగడం ∙ వ్యాధి సోకిన జంతువు తాకిన ఉపరితలాన్ని/ప్రాంతాన్ని ముట్టుకోవడం ⇒ దోమలు, పేలు వంటివి కుట్టినప్పుడు ఇవే జూనోటిక్ వ్యాధులు.. ⇒ ఆంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, బొవైన్ ట్యూబర్క్యులోసిస్, క్యాట్ స్క్రాచ్ ఫీవర్, డెంగీ ఫీవర్, ఎబోలా, ఎన్సెఫలైటిస్, ఫిష్ ట్యాంక్ గ్రాన్యులోమా, గ్లాండర్స్, హెపటైటిస్–ఈ, లెప్టోస్పైరోసిస్, లైమ్ డిసీజ్, మలేరియా, ప్యారట్ ఫీవర్, ప్లేగు, క్యూ ఫీవర్, రేబీస్, ర్యాట్ బైట్ ఫీవర్, రింగ్వార్మ్, స్వైన్ ఫ్లూ, డిప్తీరియా తదితరాలు. -
అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్
న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఐఐటీ–మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో 3,127 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, జేఎన్‌యూ, బీహెచ్‌యూ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే కళాశాల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా కాలేజీ అగ్రస్థానం దక్కిచుకుంది. మరోవైపు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థలు సత్తా చాటాయి. టాప్–10లో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్మెంట్ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) తొలి 10 స్థానాల్లో ఆరింటిని దక్కించుకున్నాయి. వీటిలో ఐఐఎం–బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, ఐఐఎం–ఢిల్లీ, ఐఐఎం–ముంబై, ఐఐఎం–రూర్కీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉన్నతవిద్య విషయంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంపై రాష్ట్రపతి కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ ఐఐటీ దేశంలోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ కల్పనల్లో ఐఐటీ-బాంబే యూనివర్సిటీ మెరుగ్గా ఉందని క్వాక్వారెల్లి సిమండ్స్ (క్యూఎస్) ర్యాకింగ్స్ సంస్థ వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే అధిక పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచిందని తెలిపింది. ఇక ఐఐఎస్సీ బెంగుళూరు సైన్స్ విభాగంలో టాప్‌లో నిలవగా... ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశమిచ్చే సంస్థల ప్రతిష్ట ఆధారంగా సర్వే నిర్వహించినట్టు క్యూఎస్ ర్యాకింగ్స్ తెలిపింది. టాప్‌టెన్ యూనివర్సిటీలకు క్యూఎస్ సర్వే ర్యాంకులు ప్రకటించింది. మూడు, నాలుగు స్థానాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ ఉండగా.. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏడో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ రూర్కే తొమ్మిదో స్థానంలో, ఐఐటీ గువాహటి పదో స్థానాల్లో ఉన్నాయి. -
టాప్ 250లో లేని భారత యూనివర్సిటీలు
లండన్ : ‘ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్లో భారత్ నుంచి ఒక్క విశ్వవిద్యాలయం కూడా చోటు దక్కించుకోలేదు. కాగా, బుధవారం విడుదలైన ఈ జాబితాలో ప్రపంచ అత్యుత్తమ యూనివర్సీటీగా ఆక్స్ఫర్డ్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మాసాచుసెట్స్ నాలుగో స్థానంలో ఉంది. 2019కి సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 250 యూనివర్సీటీలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్ ఇచ్చింది. ఇదిలాఉండగా.. భారత్‌లోని అన్ని యూనివర్సిటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగుళూరు టాప్‌లో నిలిచింది. ఐఐటీ-ఇండోర్, ఐఐటీ-బాంబే యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోని భారత్.. గతేడాదికంటే కొంత మెరుగు పడింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబితాలో భారత్‌నుంచి పోయిన సంవత్సరం 42 యూనివర్సీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో 250పైన ర్యాంకులు గల దేశాల జాబితాలో ఇండియా అయిదో స్థానంలో నిలిచింది. ఐఐఎస్సీ బెంగుళూరు 251-300 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోంది. -
అగ్ర స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు
-
అగ్ర స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు
న్యూఢిల్లీ: బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఐదు కేటగిరీల్లో 3,300 విద్యా సంస్థలపై చేసిన అధ్యయనం ద్వారా రూపొందించిన ర్యాంకుల నివేదికను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం విడుదల చేశారు. ఈ విభాగంలో అత్యుత్తమ కాలేజీగా ఐఐటీ మద్రాస్ రెండవ స్థానంలో, ఐఐటీ బాంబే మూడవ స్థానంలో నిలిచాయి. అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, రెండోస్థానంలో ఐఐటీ ముంబై నిలిస్తే, ఐఐటీ హైదరాబాద్ పదోస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో, ఉస్మానియా యూనివర్శిటీకి 23, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్శిటీలకు 43వ స్థానాల్లో దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ వార్షిక ప్రక్రియగా ర్యాంకు విధానాన్ని ప్రారంభించామని, ఎక్కువ కేటగిరీ లను చేర్చడం ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి ముందే ఆ విద్యా సంస్థకు సంబంధించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు. కాగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, తదితరుల పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు. ఓవరాల్ ర్యాంకులు 1. ఐఐఎస్సీ-బెంగళూరు 2 . ఐఐటీ-చెన్నై 3. ఐఐటీ-బాంబే 4. ఐఐటీ-ఖరగ్‌పూర్ 5. ఐఐటీ-ఢిల్లీ 6. జేఎన్‌యూ-ఢిల్లీ 7. ఐఐటీ-కాన్పూర్ 8. ఐఐటీ -గౌహతి 9. ఐఐటీ-రూర్కీ 10. ఐఐటీ- బెనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)-వారణాసి బెస్ట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్స్ 1. ఐఐఎం-అహ్మదాబాద్ 2. ఐఐఎం-బెంగళూరు 3. ఐఐఎం-కోల్‌కతా 4. ఐఐఎం-లక్నో 5. ఐఐఎం-కాజీకోడ్ 6. ఐఐటీ-ఢిల్లీ 7. ఐఐటీ- ఖరగ్‌పూర్ 8. ఐఐటీ- రూర్కీ 9. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్- జమ్షెడ్పూర్ 10. ఐఐఎం- ఇండోర్ టాప్ యూనివర్శిటీలు 1. ఐఐఎస్ఈ-బెంగళూరు 2. జేఎన్‌యూ-న్యూఢిల్లీ 3. బీహెచ్‌యూ-వారణాసి టాప్ కళాశాలలు జాబితా 1. మిరాంద హౌస్ -ఢిల్లీ 2. లయోలా కాలేజ్-చెన్నై 3. శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్-ఢిల్లీ టాప్ ఫార్మా ఇనిస్టిట్యూట్స్ 1.జమియా హమ్దర్ద్-న్యూఢిల్లీ 2. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్స్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్- మొహాలి 3. యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్స్ సైన్సెస్