అగ్ర స్థానంలో ఐఐఎస్‌సీ-బెంగళూరు | IISc bangalore is no 1 institute, JNU second best university | Sakshi
Sakshi News home page

అగ్ర స్థానంలో ఐఐఎస్‌సీ-బెంగళూరు

Published Mon, Apr 3 2017 4:38 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

అగ్ర స్థానంలో ఐఐఎస్‌సీ-బెంగళూరు - Sakshi

అగ్ర స్థానంలో ఐఐఎస్‌సీ-బెంగళూరు

న్యూఢిల్లీ: బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)కి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.  నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఐదు కేటగిరీల్లో 3,300 విద్యా సంస్థలపై చేసిన అధ్యయనం ద్వారా రూపొందించిన ర్యాంకుల నివేదికను కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌  సోమవారం విడుదల చేశారు. ఈ విభాగంలో అత్యుత్తమ కాలేజీగా ఐఐటీ మద్రాస్ రెండవ స్థానంలో, ఐఐటీ బాంబే మూడవ స్థానంలో నిలిచాయి.  

అలాగే ఇంజినీరింగ్‌ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవగా, రెండోస్థానంలో ఐఐటీ ముంబై నిలిస్తే, ఐఐటీ హైదరాబాద్‌ పదోస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్‌ మొదటి స్థానంలో, ఉస్మానియా యూనివర్శిటీకి 23, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్శిటీలకు 43వ స్థానాల్లో దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా జవదేకర్‌ మాట్లాడుతూ వార్షిక ప్రక్రియగా  ర్యాంకు విధానాన్ని ప్రారంభించామని, ఎక్కువ కేటగిరీ లను చేర్చడం ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి ముందే ఆ విద్యా సంస్థకు సంబంధించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు. కాగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, తదితరుల  పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు.

ఓవరాల్‌ ర్యాంకులు

1. ఐఐఎస్‌సీ-బెంగళూరు
2 . ఐఐటీ-చెన్నై
3. ఐఐటీ-బాంబే
4. ఐఐటీ-ఖరగ్‌పూర్‌
5. ఐఐటీ-ఢిల్లీ
6. జేఎన్‌యూ-ఢిల్లీ
7. ఐఐటీ-కాన్పూర్‌
8. ఐఐటీ -గౌహతి
9. ఐఐటీ-రూర్కీ
10. ఐఐటీ- బెనారస్‌ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)-వారణాసి

బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్స్‌

1. ఐఐఎం-అహ్మదాబాద్‌
2. ఐఐఎం-బెంగళూరు
3. ఐఐఎం-కోల్‌కతా
4. ఐఐఎం-లక్నో
5. ఐఐఎం-కాజీకోడ్‌
6. ఐఐటీ-ఢిల్లీ
7. ఐఐటీ- ఖరగ్‌పూర్‌
8. ఐఐటీ- రూర్కీ
9. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- జమ్‌షెడ్‌పూర్‌
10. ఐఐఎం- ఇండోర్‌

టాప్‌ యూనివర్శిటీలు

1. ఐఐఎస్‌ఈ-బెంగళూరు
2. జేఎన్‌యూ-న్యూఢిల్లీ
3.  బీహెచ్‌యూ-వారణాసి

టాప్‌ కళాశాలలు జాబితా

1. మిరాంద హౌస్‌ -ఢిల్లీ
2. లయోలా కాలేజ్‌-చెన్నై
3. శ్రీరామ్‌ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌-ఢిల్లీ

టాప్‌ ఫార్మా ఇనిస్టిట్యూట్స్‌

1.జమియా హమ్‌దర్ద్‌-న్యూఢిల్లీ
2. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పార్మాస్యూటికల్స్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌- మొహాలి
3. యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పార్మాస్యూటికల్స్ సైన్సెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement