
ఇష్టపడి చదవండి
పుట్టపర్తి టౌన్ : ఇష్టపడి చదివితే లక్ష్యం ఎంత పెద్దదైనా సులభంగా సాధించవచ్చని సంస్కృతీ విద్యాసంస్థల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సంస్కృతీ స్కూల్స్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్రెషర్స్‌డే వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జూనియర్, సీనియర్స్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయ వేషధారణలో విద్యార్థినులు ర్యాంప్ వాక్ నిర్వహించారు. కళాశాల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడేతత్వంతోపాటు నెపుణ్యాలను పెం పొందించుకోవడంపై విద్యార్థులు దృష్టిసారిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసన్, సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.