సాక్షి, రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్‌గా మరోసారి గుర్తింపు పొందింది. అదేవిధంగా ప్రపంచంలో 29వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్–2023ని సోమవారం ప్రకటించారు.
గతేడాది ప్రపంచస్థాయిలో 38వ స్థానంలో ఉన్న ఐఎస్‌బీ ఈసారి 29వ స్థానంలో నిలవడం విశేషం. ఈ ర్యాంకులతో ఐఎస్‌బీ అసాధారణమైన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లకు మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లయింది. ఇక భవిష్యత్‌లో అనుకూలించే ప్రోగ్రామ్‌ల విభాగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ర్యాంకు పొందిన ఐఎస్‌బీ.. ఎఫ్‌టీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఓపెన్ ర్యాంకింగ్ 2023లో దేశంలో మూడవ స్థానం, ప్రపంచంలో 65వ స్థానంలో నిలిచింది. కాగా గ్రోత్ పారామీటర్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం.
ఈ సందర్భంగా ఐఎస్‌బీ డిప్యూటీ డీన్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ప్రొఫెసర్ దీపామణి మాట్లాడుతూ ఎఫ్‌టీ ర్యాంకింగ్‌లో ఉన్నతస్థానంతో పాటు భవిష్యత్తు ఉపయోగం పారామీటర్‌లో నంబర్ వన్ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత ర్యాంకింగ్ తాము మరింతగా కష్టించి పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సమిష్టి కృషికి ఇది నిదర్శనమన్నారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే!
Comments
Please login to add a commentAdd a comment