రాయదుర్గం (హైదరాబాద్): గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) మరో అరుదైన ఘనత సాధించినట్లు ఐఎస్‌బీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌సీఎం జర్నల్ లిస్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎస్‌సీఎం జర్నల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రీసెర్చ్ జర్నల్ పబ్లికేషన్స్‌లలో ప్రచురించబడిన పరిశోధనా పత్రాలను పరిగణిస్తుంది.
ప్రధానంగా విశ్లేషణాత్మక, అనుభావిక రంగాలలో పరిశోధన పత్రాలపై దృష్టి పెడుతుంది. ఈ క్రమంలో ఉత్తమ నిర్వహణ పరిశోధన విశ్వవిద్యాలయాలు, బీ–స్కూల్స్, సంస్థల ర్యాంకింగ్స్‌ను ఎస్‌సీఎం జర్నల్ లిస్ట్ 2015–20 కాలానికి ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ దేశంలోని బిజినెస్ స్కూళ్ళలో మొదటిస్థానంలో, ప్రపంచస్థాయిలో 64వ స్థానంలో నిలిచింది.
ఇక్కడ చదవండి:
రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే..
‘సేఫ్’ జోన్‌లోకి సైబర్ వాంటెడ్స్
Comments
Please login to add a commentAdd a comment