freshers day
-
అనంతపురం : మెడికో ఫ్రెషర్స్ డే అదరహో (ఫొటోలు)
-
ఐస్‌క్రీమ్ ర్యాగింగ్
దాదాపు ముప్పయ్యేళ్ల కిందటి సంఘటన. అవి నేను వాకాడులో ఇంజనీరింగ్ కోర్సులో జాయినయ్యాను. ర్యాగింగ్ ఎక్కవనే చెప్పాలి. ఇంకా ఫ్రెషర్స్ డే జరగకపోవడంతో సీనియర్స్ కంట కనబడటానికి భయపడే వాళ్లం. ఆ సంవత్సరం సీట్లు పెంచడంతో పాటు ఉన్న కాలేజీలకు కొత్త బ్రాంచెస్కు అనుమతి రావడంతో కౌన్సెలింగ్ ఆగకపోవడంతో నాలాంటి వారికి ఏదో మూల ఆశ. కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలి. కారణం కంప్యూటర్స్ కోర్సుపై ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకోసం కాలేజీ క్లాసులు ముగిసిన తర్వాత అతి కష్టం మీద సీనియర్స్ కంట కనబడకుండా తప్పించుకుని గూడూరు వెళ్లే బస్సులో కూర్చున్నాను. డబ్బులు బొటాబొటిగా మాత్రమే ఉండటంతో గూడూరులో బస్సు దిగిన తర్వాత రైల్వేస్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాను. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండటంతో టికెట్ తీసుకుని మొదటి నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి పచార్లు ప్రారంభించాను రేపటి కౌన్సెలింగ్ గురించి ఆలోచిస్తూ. ఎందుకు వచ్చారో తెలియదు, కాని అక్కడకు వచ్చిన మా సీనియర్స్ కంటబట్టాను సరిగ్గా ఐస్‌క్రీమ్ షాపు ముందు. అది ప్లాట్‌ఫామ్‌పైనే. అంతే నా పైప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకుని పారిపోదామా అనిపించింది. వారు ఒక్కసారిగా నా మీద పడ్డంత పని చేశారు. ‘ఇంకా ఫ్రెషర్స్ డే కాలేదు. అప్పుడే సినిమాలకు తయారయ్యావా?’ అని ఒకరు.. ‘గూడురుకు రావద్దని తెలియదా?’ అని మరొకరు.. ఈలోగా సెల్యూట్ చెయ్యబోతే వారించి, అతి వినయం పనికిరాదని గదమాయించారు. వారు నార్మల్ అయ్యాక అసలు విషయం వివరించి చెప్పాను. ‘సరే గూడురు వచ్చినందుకు నీకు జరిమానా.. అందరికీ ఐస్‌క్రీమ్స్ ఇప్పించు’ అన్నారు. అంతే నా గుండె గుభేల్మంది. కారణం డబ్బులు తక్కువగా ఉండటమే. ఐస్‌క్రీమ్ షాపులో పది కప్పులు ఇవ్వమని చెప్పాను. కానీ అందులో ఉన్న ఒక సీనియర్‌కి ఇంకా కోపం తగ్గలేదు కాబోలు. అందుకే నా కప్పు తీసుకుని, దాంతో తినడానికి ఇచ్చిన వెదురు స్పూన్‌ను పట్టాలపైకి విసిరేసి, కప్పు మాత్రమే ఇచ్చాడు. ఐస్‌క్రీమ్ కరగకముందే తినమన్నాడు. చేతివేళ్లు ఉపయోగించవద్దని షరతు విధించాడు. ఒకవేళ నేను అలా తినకపోతే బిల్లు నేనే చెల్లించాలని, తింటే తాను చెల్లిస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. షాపతను, సీనియర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్కక్షణం ఆలోచించి, కప్పు మీదనున్న మూత తీసి, దాన్ని స్పూన్‌లా మలచి తినడం మొదలుపెట్టాను. వారు కాస్త కంగుతిన్నట్టనిపించింది. ‘నువ్వు కంప్యూటర్స్ కోర్సుకి బాగా సూటవుతావు’ అని మెచ్చుకున్నారు. సీనియర్ బిల్లు పే చేయక తప్పలేదు. ర్యాగింగ్ గురించి విన్నప్పుడల్లా ఈ సంఘటన గుర్తుకొచ్చి, నవ్వొస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. నాకు కంప్యూటర్స్ కోర్సులో సీటు రాకపోవడం. – కె. వెంకటరమణారావు, కరీంనగర్ -
మెరిసింది.. విల్లామేరీ
-
కేక పెట్టించారు..
అనంతపురం మెడికల్ : వారంత కాబోయే వైద్యులు.. అహర్నిశం పుస్తకాలతో కుస్తీ పట్టే వీళ్లంతా కొద్ది సేపు హల్చల్ చేశారు. తమ ఆటపాటలతో ఆహుతులను అలరించారు. యువతను కేకపెట్టించారు. ఇందుకు అనంతపురంలోని మెడికల్ కళాశాల గురువారం వేదికైంది. అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ‘ఫ్రెషర్స్ డే’ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోండి ‘మెడికల్ ర్యాంక్ ఎంత వచ్చిందన్నది ముఖ్యం కాదు. కోర్సు పూర్తయ్యేలోగా మనం ఎంత నేర్చుకున్నామన్నది ముఖ్యం. బాగా చదువుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. ఉత్తమ డాక్టర్లుగా ఎదగండి. పవిత్రమైన వైద్య వత్తిని ఎంచుకున్నందుకు మానవతా విలువలతో పేదలకు సేవ చేయండి’ అంటూ వైద్య విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరాబు సూచించారు. ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ప్రపంచంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నతులుగా ఎదగాలన్నారు. విద్యార్థుల్లో సజనాత్మకత పెరిగేలా చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుకు సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ చిట్టినరసమ్మ, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌లు మాట్లాడుతూ ఇక్కడ మంచి వాతావరణంలో విద్యను అభ్యసించి భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. అనంతరం 2016 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు ఐడీ కార్డులు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు సంపత్‌కుమార్, ప్రవీన్దీన్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశినాయుడు, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. డాన్సులు, స్కిట్లతో ఆదరగొట్టిన మెడికోలు ఉత్సాహం ఉరకలెత్తింది. వైద్య విద్యార్థుల డ్యాన్స్‌లు, కేరింతలతో అనంతపురం మెడికల్ కళాశాల ఆడిటోరియం దద్దరిల్లింది. ఫ్రెషర్స్ డే సందర్భంగా గురువారం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ‘యువ జోష్’ సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. ‘ప్రణామం..ప్రణామం’ అంటూ ప్రారంభమై ‘వందేమాతరం..’ అంటూ ముగింపు ఇచ్చారు. మధ్యమధ్యలో రీమిక్స్ గీతాలు, స్కిట్లు అలరించాయి. రోగాలతో సతమతమవుతున్న జనాన్ని వచ్చీరాని వైద్యంతో చంపొద్దంటూ ‘జనతా క్లినిక్’ పేరుతో ఇచ్చిన సందేశం ఆలోచింపజేసింది. ‘ఆకు చాటు పిందె తడిసె’.. ‘నా కళ్లు చెబుతున్నాయి’ అంటూ తన ప్రేమను తెలియజేసిన వేళ ‘ఆకాశంలో ఒక తార’ రాలినట్టు కన్పించి ‘ఐ వాన్న ఫాలోఫాలోఫాలో యూ’ అంటూ వెంటపడి ‘దివి నుంచి దిగివచ్చిన ఆపిల్ బ్యూటీ’ని ప్రశ్నించింది. అంతలోనే అమ్మాయిలు ‘గోరీ తేరా ఝుంకా’.. ‘నాచేంగే సారే రాత్’ అంటూ హుషారెత్తించారు. వెను వెంటనే ‘సునో జోర్సే దునియావాలే’ అంటూ ‘కబాలి’ ఎంటరయ్యాడు. ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన’ వచ్చి ‘శుభలేఖా రాసుకున్నా మదిలో ఎప్పుడో’ అంటూ ‘ఒకలైలా కోసం..తిరిగి’ ‘రామ్మా చిలకమ్మా..ప్రేమా మొలకమ్మా..’ అంటూ విన్నవించుకున్నాడు. అంతలోనే ‘ముంతలో కల్లు ఊరిస్త ఉంటే’ ‘నిలువద్దము నిను ఎపుడైనా..నువు ఎవ్వరు అని అడిగేనా’ అంటూ ‘గర్ల్‌ఫ్రెండ్ లేని లైఫె వేస్ట్ కదా..!’ అని కేక పుట్టించారు. చివరగా ‘దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా’.. అంటూ గ్రామీణులు ఉల్లాసంగా ఉన్న వేళ యుద్ధం ప్రారంభం కావడంతో ‘దేశం మనదే’ అంటూ వెళ్లి శత్రువులతో పోరాడాక ఓ జవాను అమరుడైతే అతడి పార్థివదేహాన్ని స్వగ్రామానికి తెచ్చిన వేళ కాసేపు అందరూ ఉద్వేగానికి లోనై కంటతడి పెడుతూ ‘వందేమాతరం’ అంటూ ముగించారు. -
సిమ్స్‌లో ఫ్రెషర్స్ డే ఉత్సాహం
లక్ష్మీపురం: భవిష్యత్తులో మెడికల్ విభాగాలకు మంచి భవితవ్యం ఉంటుందని ఎన్.ఆర్.ఐ కళాశాల ప్రొఫెసర్, ఆర్డోపెడిక్ డాక్టర్ అమర్నాథ్ సూరత్ అన్నారు. మంగళ్దాస్నగర్లోని సిమ్స్ ఫార్మసీ కళాశాలలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలో ఆయన మాట్లాడారు. విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్థోపెడిక్ డాక్టర్ దక్షిణామూర్తి మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డైరెక్డర్ బి.భరత్‌రెడ్డి, డాక్టర్ బి.శివశిరీష, ప్రిన్సిపల్ డాక్టర్ యస్.మనోహర్‌బాబు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
-
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
-
శ్రమ, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు
హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ జనగామ : విద్యార్థులు తమ లక్ష్యాలను అధిగమించేందుకు శ్రమ, పట్టుదలతో కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాహితీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించినప్రేషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ కరై కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని చంద్రకుమార్ ప్రారంభించారు. కష్టపడితే ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్లాలో తనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వాల నుంచి దేశంలో పారిశ్రామికవేత్తలు తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను రాబట్టుకోగలితే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించవచ్చన్నారు. కానీ, ప్రభుత్వాల అసమర్థత కారణంతో పారిశ్రామిక వేత్తలు వేల కోట్ల రూపాయల రుణాలను చెల్లించడం లేదన్నారు. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా కన్న తల్లిదండ్రులు, విద్యాబుద్దులు నేర్పిన గురువులను మరిచిపోవద్దని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రకుమార్‌ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆకుల నర్సింహులు, అధ్యాపకులు ఉపేందర్, రత్నాకర్, భాస్కర్, సతీష్, మహేష్, రాజు, భాస్కర్, రాంబాబు, రామచంద్రం, రాజకొంమురయ్య, దివ్య, చైతన్య, శ్వేత, శ్రీకాంత్ ఉన్నారు. 12జెజిఎన్05 : చంద్రకుమార్‌ను సత్కరిస్తున్న యాజమాన్యం -
ఇష్టపడి చదవండి
పుట్టపర్తి టౌన్ : ఇష్టపడి చదివితే లక్ష్యం ఎంత పెద్దదైనా సులభంగా సాధించవచ్చని సంస్కృతీ విద్యాసంస్థల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సంస్కృతీ స్కూల్స్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్రెషర్స్‌డే వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జూనియర్, సీనియర్స్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయ వేషధారణలో విద్యార్థినులు ర్యాంప్ వాక్ నిర్వహించారు. కళాశాల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడేతత్వంతోపాటు నెపుణ్యాలను పెం పొందించుకోవడంపై విద్యార్థులు దృష్టిసారిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసన్, సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు. -
సామాజిక ఇంజినీర్లుగా ఎదగాలి
జేఎన్టీయూ : ఇంజినీరింగ్ పూర్తయిన ప్రతి ఒక్కరూ దేశ పురోగతికి దోహదపడి, సామాజిక ఇంజినీర్లుగా ఖ్యాతి దక్కించుకోవాలని జేఎన్టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్ పేర్కొన్నారు. గురువారం జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పటికప్పుడు నూతన అంశాలపై అధ్యయ నం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందచేశారు. జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య పాండురంగడు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ప్రిన్సిపల్ ఆచార్య బి. ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఎంఎల్ఎస్ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఫ్రెషర్స్ డే
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్‌డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన ఈ వేడుకలకు వైవీయూ రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు హాజరై సందేశమిచ్చారు. విద్యార్థులు ర్యాగింగ్ వంటి వాటి జోలికి వెళ్లకుండా చక్కటి స్నేహపూర్వక వాతావరణంలో విద్యనభ్యసించాలని సూచించారు. అనంతరం అధ్యాపకులు డాక్టర్ ఎన్.వెంకట్రామిరెడ్డి, ఎస్.వి.రమణ, ఏటీవీ రెడ్డిలు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థినులు తమ భావాలను వ్యక్తీకరించారు. అనంతరం సైన్స్‌బ్లాక్ ఆవరణలో రెక్టార్, అధ్యాపకులు, విద్యార్థినులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. -
ఘనంగా ఫ్రెషర్స్ డే
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని శ్రీగాయత్రీ, మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలల్లో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినియర్ విద్యార్థులు జూనియర్స్‌కు ఆటపాటలతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమానికి జహీరాబాద్ టౌన్ సీఐ నాగరాజు , ఎస్ఐ రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుతోనే మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాయని స్వరూప, ప్రిన్సిపాల్ బి.శాంతకుమార్, కరస్పాండెంట్ విఠల్, డైరక్టర్లు ఎం.మహేష్, డి. మహేష్, డైరక్టర్లు పి.నాగరాజు, కృష్ణ, అధ్యాపకులు మహేష్, వెంకట్, సాయిబాబా, సరస్వతి, సంగీత, లక్ష్మి, కరుణ, క్రాంతి, కిష్టయ్య, అయూబ్‌ఖాన్, రాజు, సంతోష్ పాల్గొన్నారు. మాస్టర్ మైండ్ కళాశాలలో... పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎంపీడీఓ రాములు, జహీరాబాద్ టౌన్ సీఐ, ఎస్ఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిని చదువును నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్, డైరక్టర్లు షీలా రమేష్, డాక్టర్ చంద్రశేఖర్, నారాయణరెడ్డ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
భీమారం : భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా జూనియర్ ఇంటర్ విద్యార్థినులకు సీనియర్లు స్నేహపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలన్నారు. పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్వీఎస్ విద్యాసంస్థల వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఇ.సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. -
‘డీకేడబ్ల్యూ’లో ఫ్రెషర్స్ డే
నెల్లూరు(టౌన్): డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ప్రిన్సిపల్ శైలజ, డిప్యూటీ వార్డెన్ రవీంద్రమ్మ, వైస్ ప్రిన్సిపల్ ఉదయ్‌భాస్కర్, కమిటీ సభ్యులు ఆల్మాస్బేగం, పద్మప్రియ, పీఆర్ఓ జోజీ, మేనేజర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. -
కలర్ఫుల్గా సెయింట్ ఆన్స్ గర్ల్స్ కాలేజ్ ఫ్రెషర్స్‌డే
-
సిద్ధార్థ ఫ్రెషర్స్ డే వేడుకలు
-
విజ్ఞానం తరగని ఆస్తి
సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పంచుకుంటే ఆస్తులు తరిగిపోవచ్చు కానీ, విజ్ఞానాన్ని పంచుకుంటే ఇంకా పెరుగుతుందని, అది తరగని ఆస్తి అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జూనియర్లు, సీనియర్ల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలే తప్ప ఆధిపత్య పోరు ఉండరాదన్నారు. జూనియర్లకు సీనియర్లు ఆదర్శంగా నిలవాలే తప్ప, వారికి భయం కలిగించేలా ఉండరాదని చెప్పారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎలికో సంస్థ ఎండీ డాక్టర్ దాట్ల రమేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆటోమేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. ఎంతో నైపుణ్యం ఉంటేనే కానీ ఉద్యోగాల్లో స్థిరపడటం సాధ్యం కాదన్నారు. దీనికోసం డొమైన్ నాలెడ్జ్ పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచాలని సూచించారు. ‘వందలో ఒకడిగా ఉంటావో, ఒక్కడివై వందమందికి ఉపాధి కలిగిస్తావో అనేది నీ చేతిలోనే ఉంది’ అని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ‘నన్నయ’ పేరుతో ఏర్పడిన వర్సిటీలో చదువుకునే అవకాశం లభించడం ఎంతో అదృష్టమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి మాలకొండయ్య అన్నారు. గత పదేళ్లలో వర్సిటీ సాధించిన ప్రగతిని రిజిస్ట్రార్ డాక్టర్ కేఎస్ రమేష్ వివరించారు. ర్యాగింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలు వర్సిటీలో ర్యాగింగ్ ఛాయలు ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు తప్పవని స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు విద్యార్థులను హెచ్చరించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని తొలిసారిగా నన్నయ యూనివర్సిటీ కల్పించిందని, దీనిని ఇతర వర్సిటీలు కూడా అనుసరిస్తున్నాయని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేష్‌వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, నటుడు చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తిచే ‘ఆంధ్ర సంస్కృతీ వైభవం’ పేరిట ప్రదర్శించిన పద్యగానలహరి విశేషంగా అలరించింది. కార్యక్రమంలో అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఎస్.టేకి, సైన్స్ కళాశాల ్రíపిన్సిపాల్ డాక్టర్ మట్టారెడ్డి, సీడీసీ డీన్ డాక్టర్ వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన ప్రెషర్స్‌డే వేడుకలు
-
డ్యాన్సులతో అదరగొట్టిన అమ్మాయిలు
-
నగరంలో.. ఆట..పాట..
-
జేఎన్టీయూ కాలేజీలో విద్యార్థుల సందడి
-
హరి‘విల్లా’..మేరీ!
-
ఫ్రెషర్స్ డే వేడుకల్లో రగడ!
-
విద్యార్థినుల జోష్
-
యువతులంతా ఒక్కటై.. 'కొత్త'కు స్వాగతం పలుకుతూ..