ఆడిపాడుతున్న శ్రీగాయత్రి కళాశాల విద్యార్థులు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని శ్రీగాయత్రీ, మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలల్లో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినియర్ విద్యార్థులు జూనియర్స్‌కు ఆటపాటలతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమానికి జహీరాబాద్ టౌన్ సీఐ నాగరాజు , ఎస్‌ఐ రాజశేఖర్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుతోనే మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాయని స్వరూప, ప్రిన్సిపాల్ బి.శాంతకుమార్, కరస్పాండెంట్ విఠల్, డైరక్టర్లు ఎం.మహేష్, డి. మహేష్, డైరక్టర్లు పి.నాగరాజు, కృష్ణ, అధ్యాపకులు మహేష్, వెంకట్, సాయిబాబా, సరస్వతి, సంగీత, లక్ష్మి, కరుణ, క్రాంతి, కిష్టయ్య, అయూబ్‌ఖాన్, రాజు, సంతోష్ పాల్గొన్నారు.
మాస్టర్ మైండ్ కళాశాలలో...
పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎంపీడీఓ రాములు, జహీరాబాద్ టౌన్ సీఐ, ఎస్‌ఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిని చదువును నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్, డైరక్టర్లు షీలా రమేష్, డాక్టర్ చంద్రశేఖర్, నారాయణరెడ్డ తదితరులు పాల్గొన్నారు.